Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మళ్లీ ఆ స్థాయికి చేరుకోవడం సాధ్యమా!
Sudigali Sudheer : ఈటీవీ లో జబర్దస్త్ ప్రారంభం కాక ముందు సుడిగాలి సుదీర్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఫంక్షన్స్ లో చిన్న చిన్న ఈవెంట్స్ లో మ్యాజిక్ చేస్తూ పొట్ట పోసుకునే వాడు. అలాంటి సుడిగాలి సుధీర్ కి జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. జబర్దస్త్ లో చేస్తున్న సమయంలోనే ఎన్నో సినిమాల్లో నటించేందుకు ఛాన్స్ దక్కింది. ఇప్పుడు హీరోగా కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంత గుర్తింపు దక్కడానికి కారణం నూటికి నూరు శాతం ఈటీవీ మరియు మల్లెమాల అనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్లాది రూపాయల ఆస్తులను కూడ గట్టిన సుడిగాలి సుధీర్ ఈ మధ్య కాలంలో స్టార్ మా కి వెళ్ళాడు. అక్కడ ఏదో సాధించేద్దాం అనుకున్నా సుడిగాలి సుదీర్ బొక్క బోర్ల పడ్డాడు.
అక్కడికి కామెడీ స్టార్స్ కార్యక్రమాన్ని సుధీర్ వెళ్లిన వెంటనే క్యాన్సల్ చేశారు, దాంతో ఇక్కడ అవకాశాలు కోల్పోయాడు అక్కడ కూడా కనిపించడం లేదు. సుడిగాలి సుదీర్ అక్కడ ఇక్కడ కనిపించక పోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా సినిమాలు వరుసగా చేస్తేనే జనాలు గుర్తుంచుకుంటారు. అతడు సినిమాలో చేయకుండా ప్రేక్షకులకు దగ్గర అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ అందించకుండా అభిమానంను కంటిన్యూ చేయడం దాదాపు అసాధ్యం.అది కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. సుడిగాలి సుదీర్ విషయంలో అలా దక్కుతుంది అనుకుంటే పొరపాటు అవుతుంది.
ఈటీవీలో ఉన్నన్ని రోజులు సుడిగాలి సుదీర్ ఒక బుల్లి తెర సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు.. కానీ ఇప్పుడు అతడు బుల్లి తెరపై కనిపించడం లేదు కనుక అతడు బుల్లి తెర సూపర్ స్టార్ కాదు కదా కనీసం స్టార్ కూడా కాదు అంటూ అభిమానులు అభిప్రాయం చేస్తున్నారు. మళ్ళీ సుడిగాలి సుధీర్ కి ఆ స్థాయి సార్గం వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఆహా ఓటీటీ ద్వారా ప్రసారం కాబోతున్న ఒక కామెడీ షో లో సుడిగాలి సుదీర్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.