Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, గెట‌ప్ శీను లేక ఒంట‌ర‌య్యాన‌న్న రామ్ ప్ర‌సాద్.. ర‌చ్చ చేసిన శ్ర‌ద్ధా దాస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, గెట‌ప్ శీను లేక ఒంట‌ర‌య్యాన‌న్న రామ్ ప్ర‌సాద్.. ర‌చ్చ చేసిన శ్ర‌ద్ధా దాస్

 Authored By sandeep | The Telugu News | Updated on :20 May 2022,2:30 pm

Sudigali Sudheer : బుల్లితెర‌పై త‌మ కామెడీతో పసందైన వినోదం పంచే క‌మెడీయ‌న్స్‌లో సుధీర్, రామ్ ప్ర‌సాద్, శీను, ఆది త‌ప్ప‌క ఉంటారు. వీరు లేక‌పోతే ఆ షోలో సంద‌డే ఉండదు. తాజాగా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌లో శీను, సుధీర్ లేక‌పోయిన విష‌యాన్ని అనీల్ రావిపూడి ప్ర‌స్తావించ‌గా, రామ్ ప్ర‌సాద్ ఫుల్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. జబర్దస్త్ షోలో నాన్ స్టాప్ గా నవ్వించే టీం గా సుడిగాలి సుధీర్ టీం పేరు తెచ్చుకుంది. మంచి కోఆర్డినేషన్ కలిగిన గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లతో కూడిన ఈ టీమ్ ప్రేక్షకుల మోస్ట్ ఫేవరేట్. రామ్ ప్రసాద్ తనతో పాటు మూడు పాత్రలు ప్రధానంగా స్కిట్ రాస్తారు.

ముగ్గురు మిత్రులు అలవోకగా స్కిట్ లో ఒదిగిపోయి కామెడీ పంచుతారు.రామ్ ప్రసాద్ రైటర్ గా, యాక్టర్ గా సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. చాలా కాలం నుండే వీరికి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ జబర్దస్త్ షో వీడలేదు. ఈ మధ్య కాలంలో వస్తున్న స్కిట్స్ లో ఒకరుంటే మరొకరు ఉండడం లేదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్ తో పాటు, గెటప్ శ్రీను ఇద్దరూ మిస్ అయ్యారు. ఆటో రామ్ ప్రసాద్ ఒక్కడే పాత కొత్త కమెడియన్స్ తో స్కిట్ చేశారు.

Sudigali Sudheer Getup Srinu Lonely Ram prasad

Sudigali Sudheer Getup Srinu Lonely Ram prasad

Sudigali Sudheer : ఫుల్ ఎమోష‌న‌ల్‌..

దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా… తన మిత్రులు లేకుండా స్కిట్ చేయడం ఎంత ఇబ్బందిగా ఉందో చెప్పుకొని రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు.జబర్దస్త్ ఎపిసోడ్ గెస్ట్ గా దర్శకుడు అనిల్ రావిపూడి రాగా, ఆయన మాటల్లో మాటగా సుధీర్, శ్రీను లేకుండా స్కిట్ చేయడం ఎలా ఉందని? అడిగాడు. వారిద్దరూ ఉంటే నాకు చాలా ఈజీ.. బావా ఇది నీ డైలాగ్, ఇది నా డైలాగ్ అంటూ స్కిట్ జాలీగా లాగించేస్తాం. కానీ ఎప్పుడు స్కిట్ నేను రాయడంతో పాటు అందరినీ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, అంటూ రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. ఈటీవీలో సుధీర్ షోలు తగ్గిపోయాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది