Sudigali Sudheer : మోసం చేసిన అమ్మాయిపై పైనా.. సుడిగాలి సుధీర్ మంచి మనసుకు నిదర్శనమిదే
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సుధీర్ అంటే ఇప్పుడు ఓ బ్రాండ్. బుల్లితెరకే మెగాస్టార్ వంటి వాడు. ఏ షో చూసినా, ఏ చానెల్ చూసినా సుధీర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఆ మధ్య అయితే కేవలం ఈటీవీ, మల్లెమాల షోల్లోనే కనిపించేవాడు. కానీ ఇప్పుడిప్పుడే ఆ అగ్రిమెంట్ల నుంచి బయట పడ్డట్టు కనిపిస్తోంది. అందుకే ఎక్కువగా స్టార్ మా చానెల్లో కనిపిస్తున్నాడు. పండుగ ఈవెంట్ల అంటూ ఇతర చానెల్లలో సందడి చేస్తున్నాడు.అయితే సుడిగాలి సుధీర్ బ్రేకప్ స్టోరీ, విషాద ప్రేమ కథ గురించి అందరికీ తెలిసుండకపోవచ్చు.
గతంలోనే ఓ సారి తన విషాద కథను అందరికీ చెప్పాడు. తనకంటూ ఓ అమ్మాయి ఉందని, ఇద్దరం ప్రేమించుకున్నామని, తాను పొట్టకూటి కోసం హైద్రాబాద్ వచ్చానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం వేరే అతడిని ప్రేమించిపెళ్లి చేసుకుందని, తనను అలా వదిలేసిందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కథను మరోసారి అందరికీ చూపించారు.శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో సుధీర్ రియల్ లవ్ స్టోరీ అంటూ ఓ పర్ఫామెన్స్ చేశారు. అందులో సుధీర్ బాధను కళ్లకు కట్టినట్టు చూపించారు. సుధీర్ పడ్డ వేదన, ఆవేదన, బాధను చూపించారు.
తనను అలా మోసం చేసి వెళ్లిపోయిందని, మళ్లీ ఎప్పుడూ డిస్టర్బ్ చేయకని చెప్పిందంటూ ఇందులో చూపించారు. అయితే ఈ పర్ఫామెన్స్ చూస్తున్నంత సేపు సుధీర్ కంట్లో నీళ్లు తిరిగినట్టు కనిపించింది. అనంతరం సుధీర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతుంది.అలా ఆమె వెళ్లిపోయిన తరువాతే కసి పెరిగిందని, ఏదో ఒకటి సాధించాలని అనుకున్నా.. ఇక నా కుటుంబాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇటు వచ్చా.. ఇంత మంది ప్రేమను సంపాదించుకున్నా.. దీనికి ఆమె కూడా కారణం. అందుకే ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంటూ సుధీర్ తన మంచి మనసును చాటుకున్నాడు.