Sudigali Sudheer : పెళ్లి గురించి నోరు విప్పిన సుడిగాలి సుధీర్.. ఆ రోజు మా పెళ్లి అంటూ షాకింగ్ న్యూస్

Authored By Sam C | The Telugu News | Updated on : 6 March 2022, 1:00 pm

Sudigali Sudheer : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు వెండితెర‌పై కూడా స‌త్తా చాటుతున్నాడు. ఒకవైపు హోస్ట్‌గా స‌త్తా చాటుతూనే మ‌రోవైపు హీరోగా అల‌రిస్తున్నాడు. ఇప్పుడు బుల్లితెర మెగాస్టార్‌గా మారిన సుధీర్ ప్రేక్షకుల‌ని తెగ అలరిస్తున్నాడు. ఆయ‌న పెళ్లి విష‌యం ఇటీవ‌ల కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది . మ్యాజిక్ షోస్‌తో కెరీర్ ఆరంభించిన సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు సుధీర్.కమెడియన్ గా, పలు టీవీషోలకు యాంకర్ గానూ రాణిస్తున్న సుధీర్.. తన కో యాంకర్ రష్మీ గౌతమ్ తో ప్రేమలో ఉన్నాడని.

ఇద్దరు త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే ఈ వార్తలను అటు సుధీర్ కానీ.. ఇటు రష్మీ కానీ సీరియస్ గా తీసుకోలేదు.. కొన్ని టీవీ షోస్ లో ఈ ఇద్దరికీ పెళ్లి కూడా చేశారు. అయితే అదంతా అబద్దపు పెళ్లే అయినప్పటికీ సుధీర్ , రష్మీ ఫ్యాన్స్ కు మాత్రం కనువిందుగా అనిపించింది.అయితే ఇటీవ‌ల మ‌రో అమ్మాయితో సుధీర్‌తో పెళ్లి జ‌ర‌పించాడు. ఇది కూడా రీల్ మ్యారేజ్ అని తెలిసిపోయింది.తాజాగా లైవ్ లో ప్ర‌త్య‌క్షం అయిన సుధీర్ త‌న పెళ్లిపై నోరు విప్పాడు. పెళ్లికి టైం ఉందని చెప్పిన సుధీర్ ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు అంద‌రికి తెలియ‌జేస్తాను అని అన్నాడు.

sudigali sudheer gives clarity on her marriage

sudigali sudheer gives clarity on her marriage

Sudigali Sudheer : పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుధీర్..

సుధీర్ పెళ్లి విష‌యం ఎప్ప‌టికి హాట్ టాపిక్‌గానే మారుతుంది. జబర్దస్త్ షోలో టీం కంటెస్టెంట్ గా వచ్చి టీం లీడర్ గా ఎదిగి తన కష్టంతో, తన ట్యాలెంట్ తో బుల్లితెర స్టార్ గా మారి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు సుధీర్. జబర్దస్త్ లో ఫేమ్ రావడంతో సుధీర్ కి వేరే షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక పక్క టీవీ షోలు, వేరే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరో పక్క హీరోగానూ సినిమాలు ట్రై చేస్తున్నాడు సుడిగాలి సుధీర్.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp