Janaki Kalaganaledu : జానకి చదువు విషయం, వెన్నెల, దిలీప్ ముందే ప్రేమించుకున్నారని జ్ఞానాంబకు తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : జానకి చదువు విషయం, వెన్నెల, దిలీప్ ముందే ప్రేమించుకున్నారని జ్ఞానాంబకు తెలుస్తుందా?  

 Authored By gatla | The Telugu News | Updated on :6 March 2022,11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 7 మార్చి 2022, ఎపిసోడ్ 250 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి, రామా.. గోడ దూకి పారిపోవడం చూసిన మల్లిక షాక్ అవుతుంది. అసలు.. వీళ్లు రోజూ రాత్రి పూట ఇలా దొంగచాటుగా ఎక్కడికి వెళ్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటుంది. అందుకే.. వాళ్లు గోడ దూకి పారిపోయిన చోటే కాపలా కాస్తూ ఉంటుంది. వాళ్లు తిరిగి వస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలేరమ్మకు అప్పగించాలనేది ఆమె ప్లాన్. మరోవైపు రామా, జానకి.. ఇద్దరూ కోచింగ్ కోసం రాజమండ్రి వెళ్తుండగా వర్షం వస్తుంది. దీంతో కాసేపు ఇద్దరూ ఓ చెట్టు కింద నిలబడతారు. తన దగ్గర ఉన్న టవల్ తో రామా జానకికి కప్పుతాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇంతలో వర్షం వెలుస్తుంది.

does gnanamba know the truth about janaki ips coaching

does gnanamba know the truth about janaki ips coaching

దీంతో ఇద్దరూ కోచింగ్ కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. అప్పటి దాకా ఆ గోడ వద్ద కాపలా కాసిన మల్లిక. నిద్రకు ఆగలేక.. అక్కడే నిద్రపోతుంది. గోడ దూకి.. మల్లిక నిద్రపోవడానికి జానకి, రామా చూస్తారు. ఏమాత్రం చప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఉదయం చికిత వాకిలి ఊడుస్తూ.. అక్కడే నిద్రపోయి ఉన్న మల్లికను చూస్తుంది. తనను నిద్రలేపి ఇక్కడ పడుకున్నారేంటి అని ప్రశ్నిస్తుంది. దీంతో మల్లిక తలతిక్క సమాధానాలు చెబుతుంది. దీంతో తనకేమీ అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోతుంది చికిత.

మరోవైపు ఉదయమే.. జ్ఞానాంబ, గోవిందరాజు రూమ్ తలుపులకు కొడుతుంటారు. ఎవరు కొడుతున్నారని వెళ్లి జ్ఞానాంబ డోర్ తీస్తుంది. చూస్తూ… హ్యాపీ యానివర్సరీ అనే బెలూన్స్ పట్టకొని అందరూ వరుసలో నిలుచుంటారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతారు జ్ఞానాంబ, గోవిందరాజుకు.

Janaki Kalaganaledu : జానకిని మెచ్చుకున్న జ్ఞానాంబ

ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు. కానీ.. ఇప్పుడు కొత్తగా చేస్తున్నారేంటి. ఎవరి ఆలోచన ఇది అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో ఇది జానకి వదిన ఆలోచన అని చెబుతారు అఖిల్, వెన్నెల. దీంతో జానకిని మెచ్చుకుంటుంది జ్ఞానాంబ.

ఎప్పుడూ పెద్ద కోడలు అంటేనే మీకు ఇష్టం. నేనంటే అస్సలు లేక్కలేదు అంటుంది మల్లిక. దీంతో అదేం లేదు.. నువ్వంటే కూడా నాకు ఇష్టమే. ఇద్దరు కోడళ్లు నాకు సమానమే అంటుంది జ్ఞానాంబ. అయినప్పటికీ మల్లికకు కోపం తగ్గదు.

మరోవైపు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబితేనే నాన్న అంత సిగ్గు పడిపోతున్నాడు. మరి పెళ్లి చూపుల రోజు ఎంత సిగ్గుపడ్డారో అంటాడు రామా. దీంతో వద్దు.. ఆరోజును ఎందుకు గుర్తుతెస్తావు అంటుంది జ్ఞానాంబ. ఒక్కసారి మాకు ఆరోజు ఏం జరిగిందో చెప్పరా అని జానకి కూడా అడుగుతుంది.

దీంతో చెప్పడం కాదు.. చూపించేస్తాం అంటాడు గోవిందరాజు. ఇద్దరూ తమ పెళ్లి చూపులప్పుడు తయారయినట్టుగా రెడీ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది