Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ క్రేజ్ ఇదే.. షో నిర్వాహకులకు ఫ్యాన్స్ హెచ్చరికలు

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 7 October 2021, 1:20 pm

Sudigali Sudheer సుడిగాలి సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుధీర్ అభిమానులు ఎలా ఉంటారు.. ఆయన మీద ఎవరైనా ఏదైనా కౌంటర్లు వేస్తే కూడా తట్టుకోలేరు.. వారిని కామెంట్లతో నానా రకాలుగా హింసిస్తారనే సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో సుధీర్ ఫ్యాన్స్ హంగామానే ఎక్కువగా ఉంటుంది. అలాంటి సుధీర్ లేకుండా ఏదైనా స్పెషల్ షో, ఈవెంట్ చేస్తే అభిమానులు ఊరుకుంటారా? తాజాగా అలాంటి ఓ ఘటనే జరిగింది ఇప్పుడు.

Sudigali Sudheer Not Appears In Darala Bullollu Event

Sudigali Sudheer Not Appears In Darala Bullollu Event

దసరా పండుగ అంటే బుల్లితెరపై ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతీ చానెల్ కూడా ఓ స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే జీ తెలుగు ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలు వచ్చాయి. అయితే తాజాగా ఈ టీవీకి సంబంధించిన ఈవెంట్ ప్రోమో వచ్చింది. దసరా బుల్లోళ్లు అంటూ దుమ్ములేపేందుకు అందరూ రాబోతోన్నారు. అయితే జీ తెలుగు, ఈటీవీ ఇలా రెండింట్లోనూ పెళ్లి సందడి టీం వచ్చింది. అయితే ఈ షోపై సుధీర్ అభిమానులు ఓ రేంజ్ ఫైర్ అవుతున్నారు.

Rashmi Gautam Counters On Aadi And Deepik About Sudheer Track

Rashmi Gautam Counters On Aadi And Deepik About Sudheer Track

Sudigali Sudheer దసరా ఈవెంట్లో కనిపించని సుధీర్..

ఈ ప్రోమో కింద ఉన్న కామెంట్లు చూస్తే సుధీర్ రేంజ్ ఏంటో తెలిసిపోతోంది. వంద కామెంట్లు ఉంటే అందులో.. 99 కామెంట్లు సుధీర్ మీదే. మా సుధీర్ అన్న ప్రోమోలో ఎందుకు లేడు? సుధీర్ అన్న ఉంటేనే షోను చూస్తాం.. రెండో ప్రోమోలో సుధీర్ అన్న లేకపోతే అసలు ఈ షోను పట్టించుకోం.. సుధీర్ అన్న రష్మీ ఉంటేనే షో హిట్టవుతుంది.. సుధీర్ అన్నను ఎందుకు తీసుకోలేదు అంటూ షోపై, నిర్వాహకులపై సుధీర్ అభిమానులు మండిపడుతున్నారు.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి