Sudigali Sudheer : సుధీర్‌ను పూర్తిగా పక్కక పెట్టిన మల్లెమాల.. సాక్ష్యం ఇదే
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ లేని షో అంటే ఏదో ఒక వెలితి ఉంటుంది. ఆ షోకు కళ రావాలంటే సుధీర్ పంచులైనా ఉండాలి.. సుధీర్ మీద పంచులైనా వేయాలి. ఆ రెండూ కాకుండా ఉంటే షో గురించి ఎవ్వరూ పట్టించుకోరు. మొత్తానికి సుధీర్ అయితే ఢీ నుంచి తప్పుకున్నాడు. సుధీర్ తప్పుకున్నాడా? మల్లెమాల తప్పించిందా? అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే సుధీర్ మాత్రం ఢీ పద్నాలుగో సీజన్‌లో కనిపించడం లేదు.
ఈ మధ్యే వదిలిన ప్రోమోలో సుధీర్, రష్మీ, దీపిక పిల్లి కనిపించడం లేదు. దీంతో కొత్త కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇక సుధీర్‌ను మల్లెమాల టీం పక్కన పెట్టేస్తోందని, ఇక ఏ ప్రోగ్రాం, ఈవెంట్లలోనూ భవిష్యత్తులో కనిపించడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం సుధీర్ తన సినిమాలతో బిజీగా ఉండటమేనని తెలుస్తోంది.

Sudigali Sudheer Not Appers In New Year Celebration ETV Event
Sudigali Sudheer : కనిపించని సుధీర్..
తాజాగా న్యూ ఇయర్ పార్టీ అంటూ ఏర్పాటు చేసిన కొత్త ఈవెంట్‌లో మళ్లీ సుధీర్ కనిపించలేదు. ఎవరెవరినో పట్టుకొచ్చారు. కానీ సుధీర్‌ను మాత్రం పిలవనట్టున్నారు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ తెగ హర్ట్ అవుతున్నారు. సుధీర్ అన్న లేని షోను, ఈవెంట్‌ను మేం చూడం.. సుధీర్ అన్న లేకపోతే ఈవెంట్లో మజానే ఉండదంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సుధీర్ మాత్రం ఇంక ఇలాంటి ఈవెంట్లలో కనిపించడేమో.
