Sudigali Sudheer : మల్లెమాల టీంకు సుడిగాలి సుధీర్ గుడ్ బై.. శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి అవుట్?

Authored By Cinema Desk | The Telugu News | Published on: May 31, 2022, 7:00 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ తన పంథాను మార్చుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా మల్లెమాలకు దూరమైపోతోన్నాడు. జబర్దస్త్ తనకు జీవితాన్ని ఇచ్చింది.. ఎప్పుడూ దీన్ని వదిలిపెట్టమని అందరూ చెబుతుంటారు. కానీ సమయం వస్తే మాత్రం తేడా కొట్టేస్తున్నారు. మొత్తానికి సుధీర్ ఇప్పుడు టోటల్‌గా మల్లెమాలకు గుడ్ బై చెప్పినట్టు కనిపిస్తోంది. మధ్యలో ఢీ షో నుంచి వెళ్లిపోయాడు. అప్పుడే అందరికీ ఏదో తేడా కొట్టేసింది. ఇక గత కొన్ని వారాలుగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. ఇక ఇప్పుడు మరో షాక్ ఇచ్చాడు.

తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో యాంకర్‌గా కొత్త వాళ్లు కనిపించారు. శ్రీదేవీ డ్రామా కంపెనీని నిలబెట్టిందే సుధీర్. అతగాడు ఎంట్రీ ఇచ్చాకే, హోస్ట్ పగ్గాలు చేపట్టాకే షో ట్రాక్‌లో పడింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు ఆ సుధీరే షో నుంచి బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో సుధీర్‌కు బదులుగా రష్మీ యాంకర్‌గా కనిపించింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

Sudigali Sudheer Quit From Mallemala And Srudevi Drama Company

Sudigali Sudheer Quit From Mallemala And Srudevi Drama Company

సుధీర్ ఫ్యాన్స్ అయితే నెట్టింట్లో, యూట్యూబ్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. సుధీర్ అన్నా రావాల్సిందే.. సుధీర్ అన్న లేకపోతే షోను చూడం.. సుధీర్ అన్న కోసం వెయిట్ చేస్తున్నాం.. అని ఇలా నెటిజన్లు యూట్యూబ్‌లో కామెంట్లతో దడదడలాడిస్తున్నారు. మొత్తానికి సుధీర్ మాత్రం మల్లెమాల నుంచి పూర్తిగా దూరమైనట్టు కనిపిస్తోంది. ఢీ మానేసిన నాడే అందరికీ అనుమానం వచ్చింది. కానీ మిగతా రెండు షోలు చేస్తున్నాడు కదా? విబేధాలు వచ్చి ఉండవు.. ఏదో బిజీగా ఉండటం వల్ల మానేశాడని అనుకున్నారు.

ఎక్స్ ట్రా జబర్దస్త్ మానేసిన సమయంలోనే అంతా అలానే అనుకున్నారు. కానీ స్టార్ మాలో కొత్త షోకు యాంకర్‌గా మారిపోయాడు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి కూడా సుధీర్ వెళ్తాడంటూ వచ్చిన రూమర్లే ఇప్పుడు నిజమైనట్టు కనిపిస్తోంది. ఇక మళ్లీ సుధీర్ వస్తాడా? వస్తే ఎప్పుడు వస్తాడన్నది చూడాలి.

Cinema Desk

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp