Pooja Hegde : పాపం పూజా హెగ్డే ఐటెం సాంగ్స్ కూడా కలిసి రావడం లేదే ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Hegde : పాపం పూజా హెగ్డే ఐటెం సాంగ్స్ కూడా కలిసి రావడం లేదే ..?

 Authored By govind | The Telugu News | Updated on :31 May 2022,6:00 pm

Pooja Hegde : సౌత్, నార్త్ సినిమా ఇండస్ట్రీలలో పిచ్చిగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో పొడుగుకాళ్ళ సుందరు పూజా హెగ్డే ఒకరు. ఇప్పటివరకు ఆమె కెరీర్‌లో నాలుగంటే నాలుగే హిట్స్ దక్కడం ఆశ్చర్యకరమైన విషయం. అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు. అంతకముందు వచ్చిన వాటిలో గద్దలకొండ గణేష్ హిట్ అయినా అందులో ఆమెకు దక్కిన క్రెడిట్ ఏమీ లేదనే చెప్పాలి. ఒక్కపాట నాలుగు సీన్స్ అంటే అసలు హీరోయిన్గా భావించడం కరెక్టే కాదు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తర్వాత వరుసగా పూజా నటించిన పాన్ ఇండియన్ సినిమాలు బాక్సాఫిస్ వద్ద బోల్తా పడుతున్నాయి.

పూజా డేట్స్ ఇస్తే ఓ సినిమా చేసుకుంటా అని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు. బీస్ట్ సినిమా ముందు రాధే శ్యామ్మ్ పెద్ద డిజాస్టర్. అయినా పూజా లక్కీ హీరోయిన్ అన్నారు. ఆ వెంటనే బీస్ట్ ఫ్లాప్ అయింది. అసలు మన తెలుగులో ఈ సినిమాను పట్టించుకున్న నాధుడే లేడు. ఆ తర్వాత ఆచార్య. చరణ్ ఏరికోరి ఈ సినిమాలో పూజా కావాలని పెట్టుకుంటే ఆ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. ఇలా ఆమె నటించిన పెద్ద సినిమాలన్నీ ఫ్లాపవుతున్నా క్రేజ్ త్తగ్గలేదు. హీరోయిన్‌గా తెలుగులో రెండు పెద్ద సినిమాలున్నాయి. ఒకటి మహేశ్ బాబు, రెండు పవన్ కళ్యాణ్ సినిమా.

Pooja Hegde : తెలివిగా ఐటెం సాంగ్స్ చేసేందుకు ఒప్పుకుంటుంది.

అయితే, తెలివిగా పూజా ఐటెం సాంగ్స్ చేసేందుకు ఒప్పుకుంటుంది. ఒక్క సాంగ్ కోసం మూడు రోజులు డేట్స్ ఇస్తే చాలు. కనీసం కోటిన్నర వచ్చి చేతిలో పడుతుందట. అయితే, రంగస్థలం సినిమాలో చేసిన జిగేలు రాణి పాటకు వచ్చిన ఆదరణ ఎఫ్ 3 సినిమాలో పూజా చేసిన పాటకు రాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే సినిమాలు మాత్రమే కాకుండా, పూజా హెగ్డే చేస్తున్న ఐటెం సాంగ్స్ కూడా కలిసి రావడం లేదా అంటే ..! అదే అనుకోవాలేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హిందీలో చాలా నమ్మకాలు పెట్టుకుంది. కానీ, ఎప్పుడో కమిటైన సినిమాలు ఇంకా పట్టాలెక్కలేదు. సల్మాన్ సరసన ఓ సినిమా మరో స్టార్ సరసన ఓ సినిమా చేస్తుంది. ఇవి హిట్టైతేనే బాలీవుడ్‌లో నెట్టుకొస్తుంది. లేదంటే అక్కడ సర్దుకోవాల్సిందే. ఇక తాజా సమాచారం మేరకు మరో ఐటెం సాంగ్ కమిటయిందట. దీని గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది