Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ..ఆ షో ద్వారా మళ్ళీ కలవబోతున్న సుధీర్ – రష్మీ లు ..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 10, 2022, 10:30 am

Sudigali Sudheer : జబర్దస్త్ షో ద్వారా సుధీర్ రష్మీ లు బెస్ట్ పెయిర్ సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ జంటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇద్దరు ఏ షోలో కనిపించిన ఆ షో టిఆర్పి రేటింగ్స్ ఇట్టే పెరిగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి కెమిస్ట్రీని ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది సుధీర్ కొంతకాలంగా జబర్దస్త్ షో తో పాటు పలు బుల్లితెర ప్రోగ్రామ్స్ ని వదిలేసి సినిమాల వైపు వెళ్లిపోయాడు. అయితే బుల్లితెర ప్రేక్షకులు మాత్రం సుడిగాలి సుదీర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.ఈ మధ్యనే సుధీర్ ‘ గాలోడు ‘ సినిమాలో హీరోగా నటించి సక్సెస్ ను అందుకున్నాడు.

దీంతో తన తర్వాతి సినిమాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడట. అంతకుముందు జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలు చేసేవాడు. కానీ ఇప్పుడు సినీ కెరీర్ కోసం టీవీ షోలకు గుడ్ బై చెప్పేసాడు అని అనుకున్నారు. ఈ విషయంపై సుధీర్ ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్యలో ఈటీవీ ని వదిలేసి స్టార్ మా లో ప్రోగ్రాం చేశాడు కానీ అది సక్సెస్ కాలేదు. దాంతో మళ్లీ సినిమాల వైపు వెళ్లిపోయాడు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ టీవీ షోస్ లోకి వస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే త్వరలోనే సుధీర్ టీవీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట.

Sudigali Sudheer Rashmi re-entry to that show

Sudigali Sudheer Rashmi re-entry to that show

ఈటీవీలో త్వరలో ప్రారంభం కాబోతున్న డాన్స్ రియాలిటీ షో డి 15లో ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. దాదాపు 14 సీజన్ల నుండి సక్సెస్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ షో లో ఇదివరకే సుధీర్ రష్మీ జంట సందడి చేసింది. అయితే సడన్గా ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక వచ్చే ఆదివారం నుండి ఢీ 15 కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేతుల మీదుగా లాంచ్ అవ్వబోతుంది. ఈ క్రమంలో సుధీర్ తో పాటు యాంకర్ రష్మీ కూడా ఈ షో కి ఎంట్రీ ఇవ్వనుందని టాక్. ఈ విషయం తెలిసిన సుధీర్ రష్మీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత మెల్లగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి కూడా సుదీర్ రావచ్చు అని అంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp