Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మాటలకు రష్మీ హర్ట్.. కావాలనే అలా చేశాడా?
Sudigali Sudheer : సుధీర్ రష్మీ జోడికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. తామిద్దరం మధ్య ఏమీ లేదని చెప్పినా కూడా ఫ్యాన్స్ మాత్రం ఏదేదో ఊహించుకుంటారు. పెళ్లి చేసుకోండని ఉచిత సలహాలు ఇస్తారు. కానీ తామిద్దరం స్క్రీన్ మీద అలా కనిపిస్తాం కానీ అంత క్లోజ్‌గా ఉండమని, తామేం చేసినా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకేనని చెబుతుంటారు.
అలా ఈ ఇద్దరూ కూడా తమ కెమిస్ట్రీతో బుల్లితెరపై ప్రేమపాఠాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే మధ్య మధ్యలో రష్మీ మీద, ఆమె వయసు మీద సుధీర్ కౌంటర్లు వేస్తుంటారు. నిజానికి వయసులో సుధీర్ కంటే రష్మీ చాలా పెద్దది. ఆమె సినిమాల్లోకి వచ్చినప్పుడు సుధీర్ ఎక్కడో ఆడుకుంటూ ఉండే వాడంటూ ఆ మధ్య తమ స్కిట్లలో కౌంటర్లు కూడా వేశారు.

Sudigali Sudheer Satires On Rashmi Age In Jabardasth
Sudigali Sudheer : రష్మీ వయసుపై సుధీర్ కౌంటర్లు..
ఇక తాజాగా సుధీర్ మరోసారి రష్మీ వయసుపై కౌంటర్లు వేశాడు. ఆంటి అని పిలుస్తాడు. దీంతో రష్మీ హర్ట్ అవుతుంది. షుగర్ ఉందా? అని అడుగుతాడు సుధీర్. లేదు అని రష్మీ అంటుంది. నిన్న టెస్ట్ చేసుకుంటే ఉందని వచ్చింది కదా? అని మళ్లీ తన వయసు, రోగాల మీద సెటైర్లు వేశాడు. మొత్తానికి రష్మీ మాత్రం సుధీర్ మాటలకు అలా మండిపోయినట్టుంది.
