Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ టాలెంట్‌కు సింగర్ చిత్ర ఫిదా.. స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చేశారుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ టాలెంట్‌కు సింగర్ చిత్ర ఫిదా.. స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చేశారుగా

 Authored By prabhas | The Telugu News | Updated on :26 July 2022,12:00 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు ఉన్న టాలెంట్‌ సంగతి తెలిసిందే. యాంకర్‌గా, హీరోగా, డ్యాన్సర్‌గా, హోస్ట్‌గా, మెజీషియన్‌గా సుధీర్‌కు ఉన్న ప్రతిభతో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై సుధీర్ టాప్ స్టార్‌గా దూసుకుపోతోన్నాడు. సుధీర్‌కు నెట్టింట్లో విపరీతమైన అభిమాన గణం ఏర్పడింది. ఇక సుధీర్ కోసం యూట్యూబ్‌లో కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇన్ని రోజులు ఈటీవీ, మల్లెమాల అంటూ ఉన్నాడు సుధీర్. కానీ ఇప్పుడు స్టార్ మాలో సుధీర్ సందడి చేస్తున్నాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఢీ షోలను వదిలేశాడు.సుధీర్ పూర్తిగా మల్లెమాలకు దూరంగా వెళ్లిపోయాడు. స్టార్ మాలో సింగింగ్ షోను చేస్తున్నాడు. మల్లెమాల నుంచి సుధీర్ బయటకు ఎందుకు వచ్చాడు? స్టార్ మాలో ఎందుకు చేరాడు?

అన్న సంగతి తెలియడం లేదు. మొత్తానికి సుధీర్ మాత్రం ఎక్కడున్నా కూడా తన మార్క్ మాత్రం వేసేస్తుంటాడు. అలా ఇప్పుడు సింగింగ్ షోలో సుధీర్ తన టాలెంట్ చూపించాడు. సుధీర్ పాటలు పాడుతాడన్న సంగతి తెలిసిందే. ఇది వరకు రష్మీ కోసం ఎన్నో సార్లు పాటలు పాడాడు. స్టేజ్ మీద పర్ఫామెన్స్‌లు ఇచ్చాడు.అయితే తాజాగా సుధీర్ స్టార్ మా సింగింగ్ షో చేస్తున్నాడు. అందులోనూ సుధీర్ దుమ్ములేపేశాడు. తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సుధీర్ చేసిన పర్ఫామెన్స్, పాడిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఏకంగా చిత్రమ్మ కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాల్సిందే అని అనేసింది.

Sudigali Sudheer Sings WIth Chitra In Star Maa Singing Show

Sudigali Sudheer Sings WIth Chitra In Star Maa Singing Show

చిత్రతో కలిసి సుధీర్ పాట పాడాడు. అందం హిందోళం అనే పాటను సుధీర్ అద్భుతంగా పాడేశాడు. చిత్రమ్మకు పోటీగా అని అనలేం కానీ.. ధీటుగా అయితే పాడేందుకు ప్రయత్నించాడు. దీంతో చిత్రమ్మ, హేమచంద్ర అందరూ ఫిదా అయ్యారు.నీకు ముందు నుంచే ఫ్యాన్‌ని కానీ ఇది చూశాకా, నీ డెడికేషన్ చూశాక మరింత అభిమానిని అయ్యానంటూ హేమచంద్ర అంటాడు. సుధీర్ ఇంత కష్టపడ్డాడు.. దానికి మనం స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాల్సిందే అని చిత్రమ్మ అనేసింది. అలా మొత్తానికి సుధీర్ అందరినీ ఆకట్టుకున్నాడు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది