Sujatha : అన్నింట్లో వేలు పెడతావ్.. మెహబూబ్‌పై సుజాత దారుణమైన కామెంట్స్
Sujatha : బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ల గురించి అందరికీ తెలిసిందే. అందులోని చాలా మంది కంటెస్టెంట్లు ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటారు. ఉంటున్నారు. అయితే నాల్గో సీజన్‌లో కొన్ని బ్యాచులున్నాయి. అఖిల్ సోహెల్ మోనాల్ మెహబూబ్ ఒక బ్యాచ్. హారిక, అభిజిత్, నోయల్, లాస్య అనేది మరో గ్రూప్. ఇప్పటికీ వీరంతా కలిసే ఉంటారు. కానీ అభిజిత్ మాత్రం బయటకు రాడు. ఎవ్వరితోనూ అంతగా కలవడు.తన ప్రపంచం ఏదో తానే అన్నట్టుగా బతికేస్తాడు. ఇక తాజాగా […]
Sujatha : బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ల గురించి అందరికీ తెలిసిందే. అందులోని చాలా మంది కంటెస్టెంట్లు ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటారు. ఉంటున్నారు. అయితే నాల్గో సీజన్‌లో కొన్ని బ్యాచులున్నాయి. అఖిల్ సోహెల్ మోనాల్ మెహబూబ్ ఒక బ్యాచ్. హారిక, అభిజిత్, నోయల్, లాస్య అనేది మరో గ్రూప్. ఇప్పటికీ వీరంతా కలిసే ఉంటారు. కానీ అభిజిత్ మాత్రం బయటకు రాడు. ఎవ్వరితోనూ అంతగా కలవడు.తన ప్రపంచం ఏదో తానే అన్నట్టుగా బతికేస్తాడు.
ఇక తాజాగా బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లను సుమ తన క్యాష్ షోకు తీసుకొచ్చింది. ఇందులో సుజాత, మెహబూబ్, హారిక, సూర్యకిరణ్ వచ్చారు. నాల్గో సీజన్‌లో సూర్య కిరణ్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. అలా సూర్య కిరణ్ చాలా రోజుల తరువాత మళ్లీ తెర ముందుకు వచ్చాడు. ఇక సుజాత, హారిక, మెహబూబ్ అయితే చాలా చాలా యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో గంటకో పోస్ట్ పెడుతూ నానా హల్చల్ చేస్తుంటారు.
Sujatha మెహబూబ్ పరువుదీసిన సుజాత :
అయితే క్యాష్ షోలోకి వచ్చిన సుజాత, మెహబూబ్ మీద దారుణమైన కామెంట్ చేసింది. మీలో ఎవరు కోటీశ్వరులు స్పూఫ్‌గా మీలో ఎవరు క్యాషాధికారులు అనే షో పెట్టింది. వేలు చూపించినందుకు ముందుగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నారంటూ సుమ కౌంటర్ వేసింది. ఎందుకురా అన్నింట్లో వేలు పెడతావ్ అని మెహబూబ్ మీద సుజాత కౌంటర్ వేసింది. అలా మెహబూబ్‌ను సుజాత, సుమ ఇద్దరూ కలిసి ఆడుకున్నారు.