Home » Entertainment » Sukumar Cheats Ram Charan Samantha
Entertainment

Samantha : రామ్ చ‌ర‌ణ్‌ స‌మంత లిప్ లాక్ విష‌యంలో ఇంత చీటింగ్ జ‌రిగిందా..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 3, 2022, 1:30 pm
Advertisement

Samantha : రామ్ చ‌ర‌ణ్, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం రంగ‌స్థ‌లం. ఈ సినిమాలో రామలక్ష్మి (సమంత)తో సిట్టిబాబు (చరణ్) లిప్ లాక్ వేయాలి. అది మూవీలో కీలకమైన సీన్. అందువల్ల తప్పదు. కానీ చరణ్ దానికి ససేమిరా అన్నాడట. ఉపాసన ఒప్పుకోదు వద్దు ప్లీజ్! అనేశాడట. తనకు ఇలాంటివి నచ్చవని కూడా సుక్కూకి చెప్పేశాడు. కానీ ఆ సీన్ కోసం సుక్కూ ఓ ప్లాన్ వేశాడు. సమంతతో సీక్రెట్ గా ఒక మాట చెప్పాడు. సన్నివేశం తెరకెక్కించేప్పుడు మ్యానేజ్ చేయాలని అనుకుంటున్నాం. కానీ నువ్వే చరణ్ పెదవులపై ముద్దు పెట్టేయ్! అన్నాడట.

Advertisement

రంగ‌స్థ‌లం సినిమాలో చ‌ర‌న్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళుతున్న‌ప్పుడు స‌మంత ఒక్కసారిగా అత‌డిని వాటేసుకుని లిప్‌కిస్ ఇస్తుంది. ఈ లిప్‌కిస్ లో సమంత కాస్త చొరవగా చరణ్ ని ముద్దాడేసిందట. దీంతో సన్నివేశం అద్భుతంగా పండింది. అయితే సామ్ అలా చేసినందుకు తనపైనా సుకుమార్ పైనా చరణ్ సీరియస్ అయ్యారట. ఇలా చేశారేంటి? అంటూ ..! కానీ ఆ తర్వాత సుకుమార్ దానికి సర్ధి చెప్పడంతో అంతా శాంతించారు. మొత్తానికి ఆ లిప్ లాక్ సీన్ విషయంలో చరణ్ ని సామ్ చీట్ చేసినా బాగా కుదిరింది. ఇకపోతే ఆడియెన్ ని చీట్ చేయడం కోసం సుక్కూ ఇంకో ప్లాన్ కూడా వేశాడు.

sukumar cheats ram charan Samantha

Advertisement

Samantha : లిప్ లాక్ వెన‌క సీక్రెట్ ఇదే…

చరణ్ ససేమిరా అంటే ఆ సీన్ ని ఏదోలా మ్యానేజ్ చేయాలి కాబట్టి టెక్నికల్ గా చాలా ఆలోచించాడట. గ్రాఫిక్స్ లో మ్యానేజ్ చేసేద్దామని కూడా అనుకున్నాడట. కానీ సహజంగానే అది అలా కుదిరేసింది.మెగాపవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌- సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రంగస్థలం కి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. చరణ్- సమంతల నటనతో పాటు లిప్ లాక్ సీన్ కి పేరొచ్చింది. మగధీర తర్వాత చరణ్ అంతే సంతృప్తికరమైన ఫలితం రంగస్థలంతో అందుకున్నాడు. రీసెంట్‌గా చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి