Health Benefits : మనం దేవుడి పూజకు ఉపయోగించే కర్పూరం వల్ల మన శరీరంలోని అనేక నొప్పులు మటుమాయం అవుతాయంట. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. కేవలం హారతి ఇచ్చేందుకు మాత్రమే వాడే కర్పూరం వల్ల ఒళ్ల నొప్పులను క్షణాల్లో దూరం చేసుకోవచ్చు. అయితే ముందుగా కర్పూరాన్ని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నూనెతో కలిపి నొప్పి ఉన్న చోట రాయడం వల్ల ఐదే ఐదు సెకండ్లలో ఉపశమనం లభిస్తుంది. అయితే ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా.. పలు అధ్యయనాల్లో రుజువు అయింది. కర్పూరం నూనెను సమయోచిత అనాల్జెసిక్స్ తో సహా నొప్పి నివారణ మందుల్లో విరివిగా వాడుతుంటారు. కర్పూరం నూనె వల్ల దీర్ఘకాళిక కండరాల నొప్పులు, కీళ్ల నొప్పుల వంటి వాటిని తగ్గించుకోచ్చు.
2016లో పలువురు ఆరోగ్య శాస్త్ర నిపుణులు చేసిన ఓ అధ్యయనం ప్రకారం… కర్పూరం నూనె నడుము నొప్పిని తగ్గించిందట. హాట్ మరియు కోల్డ్ యాక్షన్, కర్పూరం ఆయిల్ నరాల చివర్లను మొద్దుబారేలా చేస్తుందట. అంతే కాకుండా చల్లగా ఉంచుతుందట. ఆ తర్వాత కీళ్లు, కండరాలకు రక్త ప్రసరణను పెంచి… నొప్పి ఉన్న చోటును వేడిగా మారుస్తుంది. అంతే కాకుండా తలనొప్పిని తగ్గించడానికి కర్పూరం నూనె ఉపయోగించడంపై పరిశోధన కొనసాగుతోంది. ముఖ్యమైన నూనెలు మైగ్రేన్ తలనొప్పి, సాధారణ తలనొప్పి చికిత్స చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ఈ కర్పూరం నూనె నొప్పి-సిగ్నలింగ్ మార్గాలను అణిచివేసి న్యూరోజెనిక్ వాపును బలహీనపరుస్తుందని ఆరోగ్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
కర్పూరం నూనె అరోమా చికిత్సలో ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది ముక్కు రద్దీని తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే పిల్లలు మరియు పెద్దల్లో దగ్గుతో పాటు శ్వాస సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే 2015లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం… కర్పూరం నూనె మరియు కొబ్బరి నూనె ఉపరితల కాలిన గాయాలను మాన్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపింది. అలాగే శరీరంలో ఏర్పడే పలు రకాల కణితులను కరిగించడంలో కూడా కర్పూరం అద్భుతంగా పని చేస్తుంది వివరించారు. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే ఎలాంటి నొప్పినైనా కేవలం ఐదే సెకండ్లలో తగ్గించగల శక్తి కర్పూరం నూనెకు ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మీరు ఒక సారి ఈ చిట్కాను పాటించి నొప్పులను తగ్గించుకోండి.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.