Sukumar : సుకుమార్‌కు చిరు లేఖ.. నాటి విషయాలను గుర్తుచేసుకున్న డైరెక్టర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sukumar : సుకుమార్‌కు చిరు లేఖ.. నాటి విషయాలను గుర్తుచేసుకున్న డైరెక్టర్

 Authored By bkalyan | The Telugu News | Updated on :24 February 2021,12:07 pm

Sukumar : ప్రస్తుతం సుకుమార్ పేరు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. గురువుకు తగ్గ శిష్యుడిగా బుచ్చిబాబు సానా సుకుమార్‌కు గౌరవాన్ని పది మెట్లు ఎక్కించాడు.అలాంటి శిష్యుడి వల్ల సుకుమార్‌ స్థాయి ఇండస్ట్రీలో మరింతగా పెరిగింది. అయితే సుకుమార్‌ను మెచ్చుకుంటూ చిరంజీవి ఓ లేఖ రాశాడు. ఆ లేఖను సుకుమార్ పోస్ట్ చేస్తూ తన చిన్ననాటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అసలింతకీ చిర రాసిన లేఖలో ఏముందంటే..

Sukumar emotional on Chiranjeevi Letter

Sukumar emotional on Chiranjeevi Letter

Sukumar : సుకుమార్‌కు చిరు లేఖ..

డియర్ సుకుమార్, పాఠాలు చెప్పిన గురువుగానే కాకుండా.. సినీ పాఠాలు నేర్పిన గురువుగా, బుచ్చిబాబు లాంటి ఎంతో టాలెంటెడ్ శిష్యులని నువ్వు చిత్ర పరిశ్రమకి అందిస్తున్నందుకు నీకు నా అభినందనలు. అగ్ర దర్శకుడిగా ఉంటూనే ఈ ఉప్పెన చిత్ర నిర్మాణ బాధ్యతలలోనూ పాలు పంచుకుని వాటిని అద్భుతంగా నెరవేర్చినందుకు నీకు నా శుభాకాంక్షలు. నువ్వు, నీ అనేక శిష్యులు రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమను, ప్రేక్షకులను మరెన్నో అద్భుత చిత్రాలను అందిస్తారని నమ్ముతున్నాను. కోరుకుంటున్నాను. ప్రేమతో చిరంజీవి అని ఓ లేఖను సుకుమార్ షేర్ చేశాడు.

కొణిదెల చిరంజీవి, మద్రాసు, ఇండియా. ఈ అడ్రస్ కు చిన్నప్పుడు అమాయకంగా రాసిన లేఖలకు ఇప్పుడు ప్రతిలేఖ వచ్చినంత అనుభూతి..! అంటూ తన చిన్నతనంలో మెగాస్టార్‌కు అభిమానంతో లేఖలు రాసిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. మొత్తానికి సుకుమార్‌పై చిరంజీవి ఎంత గౌరవం ఉందో ఈ లేఖతో తెలిసిపోతోంది. చిరంజీవి అంటే సుకుమార్‌కు ఎంత ఇష్టమో కూడా అతను ఇచ్చిన రిప్లైతోనే అర్థమవుతోంది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది