Home » Entertainment » Sukumar Next Movie Hero Plan
Entertainment

Sukumar : పుష్ప ని మించి 100 రెట్లు తోపు సినిమా తో రాబోతోన్న సుకుమార్ – హీరో ఎవరో గెస్ కూడా చెయ్యలేరు మీరు !

Authored By
aruna
The Telugu News | Published on: May 27, 2023, 10:00 am
Advertisement

Sukumar : పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు సుకుమార్. ఇండస్ట్రీలో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. 20 ఏళ్ల క్రితం ఆర్య సినిమాతో మొదలైన వీళ్ళ క్రేజీ కాంబినేషన్ ఇప్పటికీ హిట్ అవుతూనే ఉంది. పుష్ప సినిమా వీరిద్దరికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ స్టార్ గా, సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి రెడీ అవుతున్నారు. అయితే పుష్ప 2 సినిమా తర్వాత సుకుమార్ ప్లాన్ ఏంటి అని ఇండస్ట్రీ లో చర్చ జరుగుతుంది.

Advertisement

Sukumar next movie hero plan

మరోపక్క సుకుమార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ కాబట్టి పుష్ప తర్వాత సుకుమార్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం ఉంది. అలాగే సుకుమార్ హీరోల లిస్టులో మహేష్ బాబు కూడా ఉన్నాడని తెలుస్తుంది. అసలైతే పుష్ప కన్నా సుకుమార్ మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇద్దరి మధ్య కథ సఫలం కాకపోవడంతో అది ఆగిపోయింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు.

Advertisement

ఆ తర్వాత మహేష్ బాబు సుకుమార్ తో తప్పకుండా సినిమా చేయనున్నాడట. ఇక మనకు తెలిసిందే సుకుమార్ మహేష్ కాంబినేషన్లో ఆల్రెడీ నేనొక్కడినే సినిమా వచ్చింది అది పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈసారైనా వీరిద్దరి కాంబినేషన్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఈసారి మహేష్ కి సూపర్ హిట్ ఇవ్వాలని సుకుమార్ గట్టి ప్లానే చేశాడట. అలాగే సుకుమార్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో కూడా సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇక సుకుమార్ పుష్ప తర్వాత విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, ప్రభాస్ హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్స్ తో సుకుమార్ ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి