
Sukumar next movie with Ram Charan Rangastalam 2
Rangastalam 2 : దర్శకుడు సుకుమార్ పుష్ప చిత్రం మొదటి భాగం విజయవంతం కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుండగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. మీడియా ఇంటర్వ్యూలు, బుల్లి తెర ప్రోగ్రాంలంటూ ఖాళీ లేకుండా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర అంశాలను బయటపెట్టారు. పుష్ప రెండు భాగం అనంతరం..
రామ్ చరణ్‌తో కూడా మరో సినిమా ఉంటుందని గతంలో చెప్పగా.. ఇప్పుడు ఆ తర్వాత వచ్చే ప్రాజెక్ట్ రౌడీ హీరో విజయ దేవరకొండ తో ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తరువాతే రామ్ చరణ్ తో మూవీ ఉంటుందన్నారు. దీంతో మరోసారి రంగస్థలం సీక్వెల్ అంశం తెరపైకి వచ్చింది. మెగా పవర్ స్టార్ తో సుక్కు చేయబోయే సినిమా కచ్చితంగా రంగస్థలం పార్ట్ 2 అయి ఉంటుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.అయితే ఈ కామెంట్లపై సుకుమార్ గానీ రామ్ చరణ్ గానీ ఎక్కడా స్పందించడం లేదు.
Sukumar next movie with Ram Charan Rangastalam 2
ఏదీ ఏమైనా తమ అభిమాన నటుడు మరోసారి సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారని తెలియగానే చెర్రీ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మైలు రాయిగా నిలిచి పోయింది. 1980 లలో పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గాను మంచి విజయం సాధించింది. ఇందులో నటించిన రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, అనసూయకు మంచి పేరుతో పాటు అవార్డులను తెచ్చి పెట్టింది.
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
This website uses cookies.