Suman : భారత ఆర్మీకి అన్ని ఎకరాల భూమినిచ్చిన సుమన్.. నిజమేనా..క్లారిటీనిచ్చిన హీరో.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Suman : భారత ఆర్మీకి అన్ని ఎకరాల భూమినిచ్చిన సుమన్.. నిజమేనా..క్లారిటీనిచ్చిన హీరో..

 Authored By mallesh | The Telugu News | Updated on :1 February 2022,9:00 pm

Suman : టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్..కు సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం.. సుమన్ భారత సైన్యానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ వార్తపై హీరో సుమన్ క్లారిటీనిచ్చారు.సోషల్ మీడియాలో ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో సుమన్ స్వయంగా స్పందించి వివరణ ఇచ్చారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భార‌త ఆర్మీకి 117 ఎక‌రాల భూమిని విరాళంగా ఇచ్చాన‌ని వస్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని సుమ‌న్ పేర్కొన్నారు. ఆ వార్త‌లు పూర్తిగా అబ‌ద్ధమ‌ని, వాటిని నమ్మొద్దని చెప్పారు.

వాస్త‌వానికి స‌ద‌రు భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులోనే న‌డుస్తుంద‌ని వివరించారు. ఈ నేపథ్యంలో అటువంటి అస‌త్య వార్త‌ల‌ను ఎవరూ నమ్మొద్దని సూచించారు.ఇకపోతే భూమికి సంబంధించిన ఆ వివాదం ప‌రిష్కారం అవ‌గానే దానికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తానే స్వ‌యంగా మీడియా ద్వారా చెప్తానని హీరో సుమన్ స్పష్టం చేశారు. ఇకపోతే హీరో సుమన్.. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి అందరికీ విదితమే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సుమన్.. విలన్ రోల్ ప్లే చేసి కూడా సక్సెస్ అయ్యారు.

Tollywood suman gave 117 acres of land to indian army

Tollywood suman gave 117 acres of land to indian army

Suman : అసత్య వార్తలు నమ్మొద్దని విజ్ఞప్తి..

తమిళ్ తలైవా , సూపర్ స్టార్ రజనీకాంత్ ‘శివాజీ’ చిత్రంలో సుమన్ ప్రతి కథానాయకుడి పాత్రను అత్యద్భుతంగా పోషించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. సుమన్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘రామ్ అసుర్’ఫిల్మ్ లో కనిపించారు. ‘తెలంగాణ దేవుడు’ చిత్రంలోనూ సుమన్ కీలక పాత్ర పోషించారు. ఈ పిక్చర్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బయోపిక్. కాగా, ఇందులో లీడ్ రోల్ టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్లే చేశారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది