Krishna Sp బాలు, సూపర్ స్టార్ కృష్ణకు మధ్య గొడవేంటి.. ఎందుకు దూరమయ్యారు?

Authored By mallesh | The Telugu News | Published on: November 12, 2021, 8:15 am

Krishna సూపర్ స్టార్ కృష్ణ హీరోగా మంచి ఫాంలో ఉన్న రోజులవి. ఆ టైంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ప్లే బ్యాక్ సింగర్, సింగర్‌గా తన కెరీర్ మంచిగా సాగుతోంది. సూపర్ స్టార్ సినిమాలన్నింటికీ దాదాపు ఎస్పీ బాలునే గాయకుడిగా పనిచేశారు. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కృష్ణగారు ఎస్పీబీకి కాల్ చేసి ఏదో అన్నారట. దీంతో బాలు చాలా ఫీల్ అయ్యారని తెలిసింది.

ఆ తర్వాత కృష్ణ గారు తన సినిమాలకు బాలు స్థానంలో వేరే గాయకుడితో పాటలు పాడించకున్నారట..  అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..సూప‌ర్‌స్టార్ కృష్ణ కేవలం ఒక తెలుగు చిత్ర పరిశ్రమకే చెందిన వారు కాదు. సౌతిండియాతో పాటు దేశమొత్తం ఆయన సినిమాలకు ఫ్యాన్స్ ఉండేవారు. భారత చలన చిత్రరంగం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా పేరు సంపాదించకున్నారు. ఈయనతో పాటు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా దేశంలో అన్ని సినిమా ఇండస్ట్రీలతో కలిసి పనిచేశారు.

superstar krishna clash between sp balu

superstar krishna clash between sp balu

Krishna రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్‌

తన కెరీర్‌లో దాదాపు యాభై వేలకు పైగా పాటలు పాడి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. బాలు గారు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన గాత్రం వింటే ఇప్పటికీ ఆయన మన మధ్యలోనే ఉన్నారని అనిపిస్తుంది.అయితే, ఎస్పీ బాలు, సూపర్ స్టార్ కృష్ణ గారికి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందనే విషయాన్ని ‘ప‌ద్మాల‌య శ‌ర్మ’ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు.

దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి ‘వింధ్యా కృష్ణ’ బ్యాన‌ర్లో ఓ బుర్ర క‌థ చేయ‌గా.. దానికి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు ప్లే బ్యాక్ ఇచ్చార‌ట‌. సూపర్ స్టార్ దంపతులకు ఆనాడు కాంగ్రెస్ పార్టీపై ఎంతో అభిమానం ఉండేదట. ఈ బుర్రకథ ప్రొగ్రామ్‌కు ఎస్పీబీకి ఇవ్వాల్సిన రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఇద్దరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని తెలిపారు శర్మ. అప్పట్లో పేమెంట్స్ ప్రాసెస్ చాలా నెమ్మదిగా ఉండేదని తెలిసింది.

దీంతో కృష్ణ గారికి కోపం వచ్చి బాలు స్థానంలో రాజ్ సీతారాంతో పాడించ‌డం మొదలెట్టారట..ఇక ఓ సారి సూపర్ స్టార్ కృష్ణగారు త‌న‌కు కాల్ చేసి మీరు పాట‌లు పాడ‌క‌పోతే నా సినిమాలు ఆడవా..? అని సీరియస్‌గా మాట్లాడినట్టు ఎస్పీబీ ఒకానొక సందర్భంలో క్లారిటీ ఇచ్చారు.

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp