Upasana : అత్త సురేఖా మీద చిరంజీవి త‌ల్లికి కంప్లైంట్ చేసిన ఉపాస‌న‌.. వీడియో ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Upasana : అత్త సురేఖా మీద చిరంజీవి త‌ల్లికి కంప్లైంట్ చేసిన ఉపాస‌న‌.. వీడియో !

Upasana : మెగా కోడ‌లు ఉపాస‌న గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆమె మెగా కోడలిగా,రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణిగా అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతూ ఉంటుంది. చిరంజీవి ఇంట్లో జరిగే శుభ కార్యాలు, పండుగలు, ఇతర ఈవెంట్లకు సంబంధించిన వీడియోలని ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ర‌చ్చ లేపుతుంటుంది. అయితే ఆ వీడియోల‌లో వారి మధ్య అనుబంధాలను స్పూర్తిగా తీసుకొంటారు.ఇక ఈ మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న ఫ్యామిలీలో జ‌రిగే వేడుక‌లకి సంబంధించిన వీడియోలని సోష‌ల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Upasana : అత్త సురేఖా మీద చిరంజీవి త‌ల్లికి కంప్లైంట్ చేసిన ఉపాస‌న‌..!

Upasana : మెగా కోడ‌లు ఉపాస‌న గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆమె మెగా కోడలిగా,రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణిగా అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతూ ఉంటుంది. చిరంజీవి ఇంట్లో జరిగే శుభ కార్యాలు, పండుగలు, ఇతర ఈవెంట్లకు సంబంధించిన వీడియోలని ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ర‌చ్చ లేపుతుంటుంది. అయితే ఆ వీడియోల‌లో వారి మధ్య అనుబంధాలను స్పూర్తిగా తీసుకొంటారు.ఇక ఈ మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న ఫ్యామిలీలో జ‌రిగే వేడుక‌లకి సంబంధించిన వీడియోలని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. అవి చూసి మెగా ఫ్యామిలీ ఆనందానికి అవ‌ధులు అనేవి ఉండ‌వు.ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే.

Upasana : ఉపాస‌న టీజింగ్ మాములుగా లేదు..

సురేఖ పుట్టిన రోజు సందర్భంగా మెగా కోడలు ఉపాసన ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అత్త కోడళ్లు కలిసి ప్రీ కుక్‌డ్‌ ఫుడ్‌, ఇన్‌స్టంట్‌ మిక్స్‌లు తయారు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే సమ్మ‌ర్ సంద‌ర్భంగాద వారు నోరూరించే ఆవ‌కాయ ప‌చ్చ‌డి రెడీ చేశారు. మెగా కోడలు ఉపాసన సురేఖ మామిడి కాయ పచ్చడిని కలిపే సమయంలో వీడియో తీసింది. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మొదటగా చిరంజీవి తల్లి అంజనా దేవి కనిపిస్తారు. అప్పుడు ఉపాసన ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి ‘ మీరు ఎందుకు నాయనమ్మ సీరియస్ గా ఉన్నారు’ అని అంజనాదేవిని అడుగుతుంది. దీనికి ఆమె పని లేక ఇక్కడ కూర్చున్నాను’ అంటూ పంచ్ వేస్తుంది.

Upasana అత్త సురేఖా మీద చిరంజీవి త‌ల్లికి కంప్లైంట్ చేసిన ఉపాస‌న‌

Upasana : అత్త సురేఖా మీద చిరంజీవి త‌ల్లికి కంప్లైంట్ చేసిన ఉపాస‌న‌..!

ఇక ఆత‌ర్వాత మీ కోడలు మంచిగా పికెల్‌(ఊరగాయ) చేయడం లేదా? అని అత్తపై ఫిర్యాదు చేస్తుంది ఉపాసన. అందుకు ప్రతిగా అంజనమ్మ .. ‘నువ్వున్నావ్‌ కదా.. మళ్లీ కోడలికి ఎందుకు పని? అని సరదాగా కౌంటర్‌ ఇస్తారు.ఆ త‌ర్వాత త‌న అత్త సురేఖ‌ని వీడియో తీస్తుంది ఉపాస‌న‌. అత్తమ్మ దగ్గరకు వెళ్లి ‘క్యా హో రా’ అని అడగ్గా.. తనకు హిందీ రాదని నవ్వేసింది సురేఖ. ఆ తర్వాత వెల్కమ్ టు ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ ఆ వీడియో చివర్లో తెల‌పడం మాత్రం ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చేసింది. ఉపాస‌న త‌న ఫ్యామిలీతో క‌లిసి ఇంత సంతోషంగా ఉండ‌డం మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది