surekha vani
Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అశేష ప్రేక్షకాదరణ పొందిన అందాల ముద్దుగుమ్మ సురేఖా వాణి. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తుంది. ఆమెతో పాటు ఆమె తనయ సుప్రిత కూడా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో ఇద్దరూ హల్ చల్ చేస్తుంటారు. వీరు చేసే పనికి కొందరు ట్రోల్ చేసినా, వీరివురూ తమకు నచ్చిన పని చేసుకుంటూ పోతున్నారు. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్స్‌తో పోటీ పడే లుక్స్ ఆమెవని సోషల్ మీడియాలో ఫొటోలు చూసిన వారే చేసే కామెంట్స్ చేస్తున్నారు.
తన కుమార్తె కంటే సురేఖా వాణినే అందంగా కనపడుతున్నారని కొందరు డైరెక్ట్‌గా కూడా అనేస్తుంటారు. కోవిడ్ సమయంలో కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో ఈమె చేసిన హల్ చల్ ఈమెకు మరింత క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి.అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖా వాణికి పెద్ద షాక్ తగిలింది. సురేఖా వాణి ఫోన్ నెంబర్ అంటూ ఆమె అభిమానులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు కొందరు కేటుగాళ్లు. దీంతో వెంటనే అలర్ట్ అయిన సురేఖా వాణి అది తన నెంబర్ కాదని, ఎవరు కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయోద్దని కోరింది.
surekha vani
ఇటీవల అనుపమకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ నంబర్ షేర్ చేసి.. ఇది తనది కాదంటూ, అందరూ జాగ్రత్తగా ఉండండి అని అనుపమ చెప్పుకొచ్చింది. ఆ నంబర్ నుంచి ఫోన్స్, మెసెజ్ వచ్చినా రిప్లై ఇవ్వద్దని తన అభిమానులను అలర్ట్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అయింది.. ఇటీవల అనుపమ రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.ఇక సురేఖా వాణి విషయానికి వస్తే ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలు లేకపోయిన సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ నానా రచ్చ చేస్తుంది.
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
This website uses cookies.