Home » Entertainment » Surekha Vani Daughter Supritha Fuuny Post On Her Lazyness
Entertainment

Supritha : మొత్తానికి ఒప్పేసుకున్న సుప్రిత.. అలాంటిదాన్నేనంటూ పోస్ట్

Authored By
aruna
The Telugu News | Published on: August 11, 2022, 1:20 pm
Advertisement

Supritha : సురేఖా వాణి, సుప్రిత ఈ ఇద్దరూ నెట్టింట్లో చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ తల్లీకూతుళ్లిద్దరూ నెట్టింట్లో తెగ అల్లరి చేస్తుంటారు. ఇక అందంలో ఈ ఇద్దరూ పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది. తల్లీకూతుళ్లలా కాకుండా.. ఫ్రెండ్స్‌లా ఈ ఇద్దరూ ఉంటారు. ఇక మోడ్రన్ దుస్తుల్లో వీరు కనిపించే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు. వెకేషన్స్‌లో వీరు ధరించే దుస్తులు కూడా వైరల్ అవుతుంటాయి. సురేఖా వాణి ప్రస్తుతం పాండిచ్చెరికి వెళ్లింది. బై బై హైద్రాబాద్ అని చెప్పి.. పాండిచ్చెరి పిలుస్తోంది అని చెప్పింది. అలా మొత్తానికి సుప్రిత ఇక్కడే ఉంది. సురేఖా వాణి ఒక్కతే బయటకు వెళ్లింది.

Advertisement

అయితే సుప్రిత తన ఫ్రెండ్ పెళ్లి కోసం వెళ్లినట్టు కనిపిస్తోంది. సుప్రిత వైజాగ్‌లో తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లినట్టు అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తన తల్లితో కలిసి పుదుచ్చెరికి వెళ్లలేదని తెలుస్తోంది. మామూలుగానే సుప్రిత నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. ఆమె ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే సుప్రిత చేసే ఫన్నీ పోస్టులు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.

Surekha Vani Daughter Supritha Fuuny Post on Her Lazyness

Advertisement

ఒక్కోసారి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. అయితే తాజాగా సుప్రిత ఓ సరదా కామెంట్ వేసింది. నేడు బద్దకస్తుల దినోత్సవం అంటూ ఓ ఫన్నీ పోస్ట్ ఉంది. ఈ రోజు నా డే అంటూ అందులో రాసి ఉంది. అదే పోస్టును సుప్రిత కూడా షేర్ చేసింది. దీంతో తాను ఎంత బద్దకస్తురాలో చెప్పకనే చెప్పేసింది. అలా మొత్తానికి సుప్రిత మాత్రం తన లక్షణాల గురించి ఇలా చెప్పేసింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి