Surekha Vani: కూతురికి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన సురేఖా వాణి.. సంబరపడిపోయిన సుప్రిత

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 11 October 2021, 4:05 pm

Surekha Vani : సురేఖా వాణి తన కూతురు సుప్రిత కోసం ఏదైనా చేస్తుంది. భర్త చనిపోయిన తరువాత సురేఖా వాణి తన కూతురి కోసమే బతుకుతోంది. అందుకే కూతురితో తల్లిలా కాకుండా ఓ స్నేహితురాలిలా ఉంటుంది. కూతురు స్వేచ్చకు ఎప్పుడూ కూడా తల్లి అడ్డు చెప్పదు. అలా ఈ తల్లీకూతుళ్లు నెట్టింట్లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే అవుట్ డౌర్ షూటింగ్‌కు సురేఖా వాణి వెళ్లినప్పుడల్లా సుప్రిత కూడా వెళ్తుంది. అక్కడంతా రచ్చ రచ్చ చేస్తుంది.

Surekha Vani Gift To Supritha

Surekha Vani Gift To Supritha

సెట్‌లో తల్లీకూతుళ్లు కలిసి బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. అలా గత ఏడాది రాజస్థాన్‌‌లో అనబెల్ల సేతుపతి అనే సినిమా షూటింగ్ సమయంలో బాగానే సందడి చేశారు. అక్కడి రిసార్ట్, ఏర్పాటు చేసిన బస, కోటలు చూస్తూ బాగానే అల్లరి చేశారు. అయితే ఇప్పుడు సురేఖా వాణి చెన్నైలో షూటింగ్ చేస్తోంది. శనివారం చెన్నైలో షూటింగ్ చేసిన సురేఖా వాణి.. హైద్రాబాద్‌కు ఆదివారం వచ్చింది. మా ఎన్నికల్లో ఓటు వేసింది. ఈ మేరకు కొన్ని పోస్ట్‌లు కూడా చేసింది.

Surekha Vani : సుప్రితకు అదిరిపోయే గిఫ్ట్..

Surekha Vani Gift To Supritha

Surekha Vani Gift To Supritha

అయితే చెన్నై నుంచి వచ్చిన సురేఖా వాణి ఒట్టి చేతులతో రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు కూతురికి అదిరిపోయే గిఫ్ట్‌ను పట్టుకొచ్చింది. సెలెబ్రిటీలకు ఐ ఫోన్‌ల మీద మోజు ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఐఫోన్ లెటెస్ట్ మోడల్‌ను సుప్రిత కోసం సురేఖా వాణి పట్టుకొచ్చింది. ఇక దీన్ని స్పెషల్ సర్ ప్రైజ్‌గా ఇవ్వడంతో సుప్రిత తెగ సంబరపడిపోయినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఐ ఫోన్‌ను చూపిస్తూ సుప్రిత మురిసిపోయింది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి