Rana : నీకు యాక్టింగ్ రాదురా అంటూ రానాని ఫుల్‌గా క్లాస్ పీకిన సూర్య‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rana : నీకు యాక్టింగ్ రాదురా అంటూ రానాని ఫుల్‌గా క్లాస్ పీకిన సూర్య‌

Rana : ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. బాహుబ‌లి సినిమా తర్వాత ఆయ‌న క్రేజ్ పెరిగింది. తెలుగుతో పాటు వివిధ భాష‌ల‌లో ఆయ‌న సినిమాలు చేస్తున్నాడు. రానా చివ‌రిగా భీమ్లా నాయ‌క్ సినిమాతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అతి పెద్ద విజ‌యం సాధించ‌డంతో పాటు రానాకి మంచి పేరు తీసుకొచ్చింది. డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌లో రానా అద్భుతంగా న‌టించాడు అంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కూడా కురిసింది.అయితే ఇంత […]

 Authored By sandeep | The Telugu News | Updated on :4 March 2022,9:30 pm

Rana : ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. బాహుబ‌లి సినిమా తర్వాత ఆయ‌న క్రేజ్ పెరిగింది. తెలుగుతో పాటు వివిధ భాష‌ల‌లో ఆయ‌న సినిమాలు చేస్తున్నాడు. రానా చివ‌రిగా భీమ్లా నాయ‌క్ సినిమాతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అతి పెద్ద విజ‌యం సాధించ‌డంతో పాటు రానాకి మంచి పేరు తీసుకొచ్చింది. డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌లో రానా అద్భుతంగా న‌టించాడు అంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కూడా కురిసింది.అయితే ఇంత అద్భుతంగా న‌టిస్తున్న రానాకి యాక్టింగ్ రాదంటూ సూర్య క్లాస్ పీకాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఈటీ ప్రీ రిలీజ్ వేడుక‌లో తెలియ‌జేశాడు రానా.

త‌మిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల జైభీమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..నటనపరంగానూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఈటీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గురువారం ఈటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు రానా దగ్గుబాటి , సత్యరాజ్, చిత్ర దర్శకుడు పాండిరాజ్ తదితరులు పాల్గోన్నారు. ఈ క్రమంలో రానా మాట్లాడుతూ.. సూర్యతో జరిగిన ఓ ఆసక్తిర‌ ఘటనను షేర్ చేసుకున్నారు.

suriya warns to rana

suriya warns to rana

Rana : రానాకి ఫుల్‌గా క్లాస్ పీకాడా..!

సూర్యగారికి పితా మగన్ సినిమా నుంచి నేను పెద్ద అభిమానిని. అప్పుడు ఆయన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. తర్వాత నేను యాక్టర్ అయిన తర్వాత నా సినిమాను ఎడిటింగ్ రూంలో ఆయన చూశారు. తర్వాత నన్ను కారులో ఎక్కించుకుని.. నాలుగు గంటలపాటు హైదరాబాద్ లోని రోడ్లపై తిప్పుతూ బాబు నువ్వు చేసేది యాక్టింగ్ కాదు.. ఏదో తట్టి మేనేజ్ చేసేస్తున్నావ్ అంటూ నాలుగు గంటలు క్లాస్ పీకారు. అలా అరోజు ఆయన నాకు క్లాస్ కారణంగానే నేను ముందుకు భళ్లాలదేవుడిగా, డానియల్ శేఖర్ గా నిలబడిగలిగాను.. అంటూ చెప్పుకొచ్చారు. అయితే రానా ఈ విషయాన్ని చెబుతున్న సమయంలో సూర్య వద్దని వారించాడు. కానీ రానా సూర్య మాటలు పట్టించుకోకుండా.. మొత్తం విషయాన్ని చెప్పేశారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది