Suryakantham : తెలుగు చిత్రసీమలో గయ్యాళి పాత్రాలకు పెట్టింది పేరు సూర్య కాంతం. వెండితెరపై ఆమె కనబడితే చాలు జనాలకు విపరీతమైన ఆగ్రహావేశాలు వచ్చేవి.. అంతలా ప్రేక్షకుల మైండ్‌లో సూర్యకాంతం రిజిస్టర్ అయిపోయింది. గయ్యాళి అత్తగా ఆమె పాత్ర పోషించింది అని చెప్పడం కంటే కూడా ఆమె ఆ పాత్రలో జీవించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.సూర్యకాంతం తన తల్లిదండ్రులకు పధ్నాలుగో సంతానం. సూర్యకాంతం నటనకు జనాలు చప్పట్లు కొట్టి ప్రశంసించడమే కాదు.. ఆమెను తమ ఇంటి మనిషిలాగా భావించేవారు. చిన్నప్పటి నుంచి పాటలు, నాట్యం పట్ల ఆసక్తి ఉన్న సూర్యకాంతం వాటిని నేర్చేసుకుంది. ఆ తర్వాత మూవీస్‌లో నటించాలనుకున్న సూర్యకాంతం..
అందుకోసం చెన్నైకి వెళ్లింది. సూర్యకాంతం చక్కటి నటి అయినప్పటికీ చాలా మంది ఆమెకు అవకాశాలివ్వలేదు. దర్శక నిర్మాతల వద్దకు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించి సూర్యకాంతం వెనక్కు వచ్చేది. ఆ సందర్భంలో ఓ రోజు జెమినీ స్టూడియోలో ‘చంద్రలేఖ’ సినిమా కోసం ఆడిషన్స్‌కు వెళ్లింది. అయితే, ఆడిషన్స్ చేసినప్పటికీ ఆమెకు అవకాశం లభించలేదు. దాంతో ఆమె వెనుదిరిగి వెళతుండగా, మేనేజర్ భూషణం ఆమెను పిలిచి డ్యాన్సర్లు తక్కువగా ఉన్నారు. డ్యాన్సర్‌గా నటించాలని చెప్పాడు. అందుకు సూర్యకాంతం ఒప్పుకోలేదు. తనకు డ్యాన్స్ రాదని అంది. దాంతో మేనేజర్ భూషణం డ్యాన్సర్లకూ డ్యాన్స్ రాదని, వాళ్లు చేసినప్పుడునువ్వు చేయవా అన్నాట. అలా మేనేజర్ చెప్పడంతో కన్విన్స్ అయిన సూర్యకాంతం చివరకు వెండితెరకు డ్యాన్సర్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత సూర్యకాంతం వెండితెరను ఏలింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి సూర్యకాంతం తెలుగు ప్రజల ప్రశంసలు పొందింది. ‘సంసారం’ అనే సినిమాలో తొలిసారి గయ్యాళి అత్త పాత్ర పోషించిన సూర్యకాంతం.. ఆ తర్వాత కాలంలో గయ్యాళి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఆమె కెరీర్‌లో ఎన్నో పాత్రలను పోషించింది.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.