Sushanth : సుశాంత్‌ని వ‌ర్జినా అంటూ నెటిజ‌న్ ప్ర‌శ్న‌.. ఆయ‌న ఏం స‌మాధానం ఇచ్చాడంటే! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sushanth : సుశాంత్‌ని వ‌ర్జినా అంటూ నెటిజ‌న్ ప్ర‌శ్న‌.. ఆయ‌న ఏం స‌మాధానం ఇచ్చాడంటే!

Sushant: అక్కినేని హీరోల‌లో స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేస్తున్నాడు సుశాంత్‌. హీరోగా చేస్తూనే మ‌రోవైపు స‌పోర్టింగ్ రోల్స్‌లోను అల‌రిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అలాగే జీ5లో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన అభిమానులతో ముచ్చటించాడు. చాలాకాలమవుతోంది, మీరు ప్రశ్నలు సంధించండి, సమాధానాలు చెప్తానన్నాడు. దీంతో దొరికిందే ఛాన్స్‌ అనుకున్న ఫ్యాన్స్‌ వరుస ప్రశ్నలతో హీరోను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినప్పటికీ సుశాంత్‌ అన్నింటికీ నిదానంగా, ఓర్పుగా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :6 June 2022,2:30 pm

Sushant: అక్కినేని హీరోల‌లో స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేస్తున్నాడు సుశాంత్‌. హీరోగా చేస్తూనే మ‌రోవైపు స‌పోర్టింగ్ రోల్స్‌లోను అల‌రిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అలాగే జీ5లో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన అభిమానులతో ముచ్చటించాడు. చాలాకాలమవుతోంది, మీరు ప్రశ్నలు సంధించండి, సమాధానాలు చెప్తానన్నాడు. దీంతో దొరికిందే ఛాన్స్‌ అనుకున్న ఫ్యాన్స్‌ వరుస ప్రశ్నలతో హీరోను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినప్పటికీ సుశాంత్‌ అన్నింటికీ నిదానంగా, ఓర్పుగా సమాధానాలిచ్చాడు. మీరు పెళ్లి చేసుకునే తారీఖు చెప్పండని ఓ నెటిజన్‌ అడిగాడు.

దీనికి హీరో స్పందిస్తూ ఎవరనేది డిసైడ్‌ కాకుండానే పెళ్లి డేట్‌ చెప్పాలా? అని ఫన్నీ కౌంటరిచ్చాడు. అల్లు అర్జున్‌తో మళ్లీ ఎప్పుడు చేస్తారు? అన్నదానికి బహుశా అల వైకుంఠపురములో సెకండ్‌ పార్ట్‌లోనేమో, బన్నీనే అడగండి అన్నాడు. నువ్వు వర్జినా అని అడిగిన ఓ నెటిజన్‌కు తాను నిప్పు అని అర్థం వచ్చేలా వెలుగుతున్న దీపం ఫొటోను షేర్‌ చేశాడు. మొత్తానికి సుశాంత్ త‌న‌ని విసిగించే ప్ర‌శ్న వేసిన కూడా చాలా కూల్‌గా స‌మాధానం ఇవ్వ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. టాలీవుడ్ నటుడు నాగార్జున మేనల్లుడు సుశాంత్‌తో..ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 కొత్తగా వెబ్‌సిరీస్ నిర్మిస్తోంది.

Sushanth gives stunning reply about virginity

Sushanth gives stunning reply about virginity

Sushanth : సుశాంత్ కూల్‌నెస్..

సుశాంత్ ఇప్పటివరకూ కన్పించని గెటప్‌లో ఈ వెబ్‌సిరీస్‌లో కన్పించబోతున్నాడు. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో చాలాకాలం గ్యాప్ తరువాత స్క్రీన్‌పై కన్పించిన నాగార్జున మేనల్లుడు సుశాంత్..తెలుగు ప్రేక్షకులకు మరోసారి చేరువయ్యాడు. కెరీర్‌లో కరెంట్, అడ్డా, దొంగాట, ఆటాడుకుందాం రా వంటి చిత్రాలతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అల వైకుంఠపురంలో కూడా మంచి క్లాస్ పాత్రలో నటించాడు. ఇప్పుడు తొలిసారిగా జీ5 నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌కు అంగీకరించాడు. కొల్లా ఎంటర్‌ప్రైజస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది