Ravanasura Movie Public Talk : రావణాసుర పబ్లిక్ టాక్.. రాడ్ దింపావు అంటూ జనాలు మీడియా ముందు డైలాగులు వీడియో వైరల్..!!

Advertisement

Ravanasura Movie Public Talk : సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తరుకెక్కించిన సినిమా రావణాసుర ఈరోజు విడుదలయ్యింది. మొదటి రోజే ఈ సినిమా నెగటివ్ టాక్ సొంతం చేసుకోంది. థ్రిల్లర్ జోనర్ కంటెంట్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్డ్ చేయడంతో సినిమా చూసే ప్రేక్షకుడి చాలా కన్ఫ్యూజన్ కి గురయ్యాడు. సెకండ్ హాఫ్ ఇంకా ఇంటర్వెల్ మరియు రవితేజ పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ అయింది. స్క్రీన్ ప్లే అతిపెద్ద మైనస్.

Ravi Teja Ravanasura Movie Genuine Public Talk
Ravi Teja Ravanasura Movie Genuine Public Talk

ఇక చివరి 20 నిమిషాలు మరి రాడ్ అని చూసిన జనాలు అంటున్నారు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీసే దర్శకుడిగా సుధీర్ వర్మ గతంలో స్వామి రారా, కేశవ, రణరంగం వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. దీంతో మాస్ మహారాజాతో “రావణాసుర” అనే పవర్ ఫుల్ టైటిల్ తో సినిమా మొదలెట్టేసరికి కచ్చితంగా ఇదొక డిఫరెంట్ కాంబినేషన్ ప్రేక్షకులను సినిమా అలరిస్తుందని మొదట భావించారు.

Advertisement

Ravanasura teaser genuine public talk| Ravanasura teaser review| Raviteja| - YouTube

కానీ సినిమా రిలీజ్ అయ్యాక… ఫలితం వేరేలా మారింది. వరుస విజయాలతో ఉన్న రవితేజ… “రావణాసుర”తో బ్రేక్ పడినట్లు అయింది. అయితే మొదటి రోజు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మీడియా ముందు చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనంగా మారాయి. అక్కినేని సుశాంత్, అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Advertisement
Advertisement