Sushmita Sen : ముస‌లోడని మోదీని ప‌క్క‌కు పెట్టి, మాజీ ప్రియుడితో తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్న సుస్మితా సేన్

Authored By Sam C | The Telugu News | Published on: August 29, 2022, 10:20 pm

Sushmita Sen : మాజీ ప్ర‌పంచ సుంద‌రి సుస్మితా సేన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈమె ఖాతా తెరిచి చూస్తే అంద‌రు షాక్ అవ్వ‌డం ఖాయం. వృత్తిప‌ర‌మైన అంశాల క‌న్నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌లలో నిలుస్తుంటుంది. ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో లవ్‌లో పడ్డనాటి నుంచి సుష్మిత ప్రతి కదలిక మీద కన్నేసారు నెటిజన్లు. ఈ క్రమంలో పలుమార్లు తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రోహ్మన్‌ షాతో షాపింగ్‌లు, సినిమాలకు వెళ్లడం చూసి ముక్కున వేలేసుకున్నారు. కొందరు మాత్రం బ్రేకప్‌ తర్వాత ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? ఏంటని సుష్మితను సపోర్ట్‌ చేస్తున్నారు.లాస్ట్ డిసెంబర్ లో తనకంటే చిన్నవాడైన తన రెండో ప్రియుడుడితో బ్రేకప్ చెప్పిన సుస్మితా సేన్ .. లలిత్ మోడీతో జతకట్టింది.

Sushmita Sen : హాట్ టాపిక్‌గా సుస్మితా..

తామిద్దరం ప్రేమలో ఉన్నామని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు లలిత్‌ మోడీ కూడా ప్రకటించారు. వీరి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాియి . లలిత్ మోడీతో ప్రేమలో ఉన్న ఆమె.. రీసెంట్ గా రెండు మూడు సార్లు,.. తన మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కింది. దాంతో ఈ న్యూస్ నెట్టింట్ట తెగ వైరల్ అవుతోంది. తాజాగా సుస్మితా సేన్.. తన కూతురు రినీ సేన్‌, మాజీ ప్రియుడు రోహ్మన్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా కెమెరా కంట పడ్డ ఈ బ్యూటీ రినీ, రోహ్మన్‌తో కలిసి ఫొటోలను పోజులిచ్చింది. కూతురు అలిషా బర్త్‌డే కోసం షాపింగ్‌ చేస్తున్నామని వెల్లడించింది.

Sushmita Sen comments on lalit modi

Sushmita Sen comments on lalit modi

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. ‘నువ్విలా నీ మాజీతో తిరుగుతుంటే అది చూసిన లలిత్‌ మోదీ ఏమైపోవాలి?’, ‘అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు”, ‘అబ్బా.. వాళ్లిద్దరూ ఒకప్పుడు లవర్స్‌, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్‌’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సుష్మిత రినీ, అలిషా అనే ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఆమధ్య లాల్‌ సింగ్‌ చద్దా మూవీ ప్రీమియర్ సందర్భంగా కూడా సుష్మితా సేన్ తన పెంపుడు పిల్లలతో పాటు కలిసి వచ్చింది. అయితే వారితో పాటు ఆమె మాజీ ప్రియుడు రోహ్మాన్‌ షాల్‌ కూడా ఉన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవలే ఆర్య 2 వెబ్‌సిరీస్‌తో కమ్‌బ్యాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే!

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp