Suspense Thriller : సక్సెస్ ‘దారి’లో కొత్త చిత్రం.. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల..

Advertisement

Suspense Thriller : ఇటీవల కాలంలో కంటెంట్ బేస్డ్ సినిమాలకు విశేషమైన ఆదరణ దక్కుతోంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త దర్శకులు సరి కొత్త కథలతో నూతన నటీనటులతో ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కొత్త ప్రయోగాలను కూడా ప్రేక్షకులు ఆదరించి వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సరి కొత్త మూవీ రాబోతుంది. ఆ చిత్రం పేరు ‘దారి’..విలకక్షణమైన కథాంశంతో తెరకెక్కిన ‘దారి’ చిత్రానికి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అవుతారని దర్శక, నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ ను తాజాగా విడుదాల చేశారు. డైరెక్టర్ యు.సుహాష్ బాబు దర్శకత్వంతో సినిమా తెరకెక్కగా, ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్‌ వారు ప్రొడ్యూస్ చేశారు.నరేష్ మామిళ్ల, మోహన్ ముత్తిరయిల్ ఈ ఫిల్మ్ కు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే, కల్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
suspense thriller daari film poster released by makers
suspense thriller daari film poster released by makers

భూమ్మీద ఉన్న ప్రతీ జీవికి ఏదో ఒక సమస్య ఉంటుందని, అలా సమస్యలతో ఉన్న వారు గమ్యానికి ఎలా చేరుకున్నారు? ఐదుగురు వేర్వేరు వ్యక్తుల జీవితాల్లో సమస్యలు ఎలా వచ్చాయి అనే ఇతి వృత్తంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా స్టోరి ఉంటుందని మేకర్స్ చెప్పారు.

Advertisement
Advertisement