Swapnika Radhe Shyam movie in painted on mouth
Radhe Shyam : సాహో తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉండగా, కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మార్చి 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబడుతుంది. రాధే శ్యామ్ సినిమాలో మన హీరో ప్రభాస్ హస్తసాముద్రికంలో నిపుణుడు. అయితే అసలు చేతులే లేని వాళ్ల భవిష్యత్తుని ఎలా చెప్పడం సాధ్యమవుతుంది?.. అంటే చేతిలోని రాతలు కాదు.. మన చేతలే భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అనే అంతర్లీనమైన సందేశాన్ని ఇచ్చాడు. ఈ సీన్, ఈ డైలాగ్ ఓ దివ్యాంగురాలిని తెగ ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలోని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక. ఈమె గతంలో కూడా అనేక బొమ్మలని నోటితో పెయింట్ వేసింది. పవన్ కళ్యాణ్ ఫోటోని కూడా వేసి పాపులర్ అయింది. తాజాగా ‘రాధేశ్యామ్’ని చూసి ఆ సినిమా తనకు ఎలా స్ఫూర్తినిచ్చిందో అంటూ ఓ పెయింట్ ని వేసి ట్వీట్ చేసింది. ఆ పెయింట్, ట్వీట్ ని డైరెక్టర్ రాధేశ్యామ్ చూసి అభినందించారు. పలు ప్రెస్ మీట్స్ లో కూడా దీనిపై మాట్లాడారు.డైరెక్టర్ రాధాకృష్ణ ఆ అమ్మాయిని కలుసుకున్నాడు. ఆమెతో పాటు ఆమె గీసిన పెయింట్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Swapnika Radhe Shyam movie in painted on mouth
ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేసి.. ”రాధేశ్యామ్ మీకు స్ఫూర్తినిచ్చింది. మీరు ఈ రోజు నాతో పాటు, దేశాన్ని కూడా ప్రేరేపించారు. నాలాంటి దర్శకులు ఏదో ఒకరోజు నీ మీద సినిమా చేస్తారని నమ్ముతున్నాను. దేవుడు నిన్ను చల్లగా చూడాలి” అంటూ రాధాకృష్ణ ట్వీట్ చేశారు. రాధే శ్యామ్ సినిమాలోని సీన్‌ను ప్రతిబింబించేలా ఆ చిత్రం ఉండటంతో షాక్ అయ్యాడు.ఇక రాధాకృష్ణ స్వప్నికని కలిసి అభినందించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దర్శకుని మంచితనాన్ని ప్రశంశిస్తున్నారు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.