Vivek : ‘కొత్త బంగారు లోకం’ బుడ్డోడు.. జబర్దస్త్ ఆర్టిస్ట్‌తో అలా కనిపించడంతో షాక్.. వీడియో!
Vivek జబర్దస్త్ ఆర్టిస్ట్ పంచ్ ప్రసాద్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాడు. ప్రతీ మాటకు పంచ్ వేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మధ్యే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ దుమ్ములేపుతున్నాడు. అయితే అనారోగ్య సమస్యలతో ఇన్నాళ్లు దూరంగా ఉన్న ప్రసాద్ ఇప్పుడు మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఆయన అనారోగ్య పరిస్థితులు, కుటుంబ సభ్యుల గురించి ప్రసాద్ ఆ మధ్యస్టేజ్ మీదే చెప్పి అందరినీ ఏడిపించేశాడు. ఆయన భార్య దానం చేసే కిడ్నీతోనే ఆపరేషన్ చేయించుకోబోతోన్నాడు ప్రసాద్.

Punch Prasad On His Friedn Vivek In Sridevi Drama Company
‘కొత్త బంగారు లోకం’ బుడ్డోడు.. Vivek
అవన్నీ కాసేపు పక్కన పెడితే.. మొన్న ఆదివారం జరిగిన ఫ్రెండ్ షిప్ డే స్పెషల్‌గా అందరూ కూడా తమ తమ ఫ్రెండ్స్‌లను తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రసాద్ తన ఫ్రెండ్‌ను తీసుకొచ్చాడు. అతను మరెవ్వరో కాదట. కొత్త బంగారు లోకం సినిమాలో చైనా బుడ్డోడు అట. అరేయ్ ప్రిన్సిపాల్ వస్తున్నాడటరా? అని క్లాసులో హంగామ చేయడం, బ్రహ్మానందం ఆ బుడ్డోడి మొహాన్ని పట్టుకుని కూర్చోబెట్టే సీన్‌లో ఉండే ఆ బుడ్డోడే ఇతగాడట.

Punch Prasad On His Friedn Vivek In Sridevi Drama Company
వివేక్ నా బెస్ట్ ఫ్రెండ్.. నేను ఆర్టిస్ట్‌ను అయ్యానంటే వాడి వల్లే.. వాడితో పాటు షూటింగ్ వెళ్లేవాడిని.. వాడి యాక్టింగ్ చూసే ఓహో యాక్టింగ్ అలా చేయకూడదని తెలుసుకుని.. బాగా చేయడంతో ఇప్పుడు ఇలా ఉన్నా అని కౌంటర్ వేశాడు. తాను హాస్పిటల్‌లో ఉన్న సమయంలో తన కోసం జాబ్ వదిలేసుకున్నాడు.. అంత మంచి ఫ్రెండ్.. కానీ తరువాత తెలిసింది.. శాలరీ తక్కువ అని జాబ్ వదిలేశాడట అంటూ మరో కౌంటర్ వేసేశాడు. అలా మొత్తానికి అతగాడిని ప్రసాద్ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు.
ఇది కూడా చదవండి ==> అత్తింట్లో గొడవలు.. నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు.. అసలు ఏం జరిగింది…?
ఇది కూడా చదవండి ==> హిమను చంపించింది మోనితే.. నన్ను కూడా చంపాలని ఇక్కడ బంధించింది..కార్తీక్ కు నిజాలు చెప్పిన అంజి
ఇది కూడా చదవండి ==> జాన్వీ కపూర్ పెళ్ళి ఎక్కడో ఫిక్సైపోయింది..పెళ్ళి కబురు చెబుతున్న శ్రీదేవి కూతురు..!
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల.. రెమ్యునరేషన్ కట్.. ఎందుకంటే..?