Taapsee pannu : ఆ బాయ్ ఫ్రెండ్స్ ప‌నికిమాలినోళ్లు.. వాళ్ల‌తో డేట్‌కి వెళ్లాన‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసిన తాప్సీ

Authored By Sam C | The Telugu News | Published on: January 28, 2022, 12:30 pm

Taapsee pannu : సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెర‌కు పరిచయంది. మొద‌టి సినిమాతోనే త‌న అభినయంతో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత మెల్ల‌గా త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. అక్క‌డ స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ వైవిధ్య‌మైన క‌థాంశంతో కూడిన చిత్రాలు చేయ‌గా, వాటితో స్టార్ హీరోయిన్‌గా మారింది తాప్సీ. ఈ అమ్మ‌డు అంద‌రి మాదిరిగా కాదు, ఏ విష‌యంపైనైన నిర్భ‌యంగా మాట్లాడుతుంది.

తాజాగా తాప్సీ తన మాజీ స్నేహితులపై తీవ్ర విమర్శలు చేసింది. మీరు ఎప్పుడైనా పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశారా? అని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు తాప్సీ చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశానని చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చింది. “అవును.. నేను చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను“ అని బిగ్గరగా నవ్వుతూ చెప్పింది. అంతేకాదు తన విదేశీ బోయ్ ఫ్రెండ్ మాథ్యూస్ బోతో రిలేషన్ షిప్ విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి ఓపెనైంది

taapsee pannu About on boy friends

taapsee pannu About on boy friends

Taapsee pannu తాప్సీ అలా అనేసింది ఏంటి?

మా నాన్న ప్ర‌తి సారీ తనలో ఏదో ఒక తప్పు కనిపెట్టేవారు కానీ మాథ్యూస్ ఎంపిక విషయంలో ఎలాంటి తప్పును కనిపెట్టలేదని అన్నారు తాప్సీ. ఇద్దరూ గౌరవప్రదమైన సంబంధాన్ని పంచుకుంటారని తాప్సీ ఇటీవల సరదాగా చెప్పింది. ప్ర‌స్తుతం తాప్సీ బాలీవుడ్, టాలీవుడ్‌లో స‌త్తా చాటుతుంది. మిషన్ ఇంపాజిబుల్ తో ప్రస్తుతం బిజీగా ఉంది. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేయాల్సి ఉంది. అలాగే తెలుగు సినిమాలో నటించేందుకు ప్లానింగ్ లో ఉంది. తాప్సీ సొంత నిర్మాణ సంస్థలో సమంత కథానాయికగా ఓ రెండు చిత్రాల్ని నిర్మించే ఆలోచన ఉందని ప్రచారమైంది.ఇదిలా ఉంటే తాప్సీ వివాదాల‌తోను వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా కంగ‌నాకి, తాప్సీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంటుంది.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp