Tabu : ఏ మాటకు ఆ మాట 50 ఏళ్లు వచ్చినా గాని టాబు అందాలు ఏమాత్రం చెక్కుచెదరలేదు వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: March 7, 2023, 9:40 am

Tabu : హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. ఒకప్పుడు తెలుగులో టాప్ మోస్ట్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసింది. నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లతో సినిమాలు చేయడం జరిగింది. నాగార్జున టబు ఇండస్ట్రీలో తిరుగులేని కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హైదరాబాదులో పుట్టిన టాబు బొంబాయిలో స్థిరపడింది. చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కెరియర్ కొనసాగించింది.

Tabu Latest Beautiful Looks In Saree Bholaa Trailer Launch Event

Tabu Latest Beautiful Looks In Saree Bholaa Trailer Launch Event

కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో “కూలి నెంబర్ 1” సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యింది. అయితే 50 సంవత్సరాలు వయసు పైబడిన గాని ఇప్పటికీ కూడా టబు అంటే పడి చచ్చే… అభిమానులు ఉన్నారు. వయసు మీద పడటంతో… హీరోయిన్ గా కాకుండా సినిమాలలో కొన్ని కీలక పాత్రలు చేస్తూ ఉంది. ఈ రకంగానే 2020లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన

Tabu Looking Beautiful In Saree At Bholaa Trailer Launch - YouTube

“అలా వైకుంటపురంలో” కీలక పాత్ర చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల అజయ్ దేవగన్ నటించిన బోలా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యింది. ఈ వేడుకలో అజయ్ దేవగన్ లతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే సమయంలో టబు కూడా అటెండ్ కావడం జరిగింది. అయితే చీరలో క్యూట్ స్మైల్ తో ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇవ్వడం జరిగింది. టబు లేటెస్ట్ అందాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp