Thaman : థమన్ కాపీ కొట్టుడు కామనే.. దొరికిపోవడం కూడా కామనే..!
ప్రధానాంశాలు:
Thaman : థమన్ కాపీ కొట్టుడు కామనే.. దొరికిపోవడం కూడా కామనే..!
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ఫీస్ట్ అందిస్తూ తెర మీద బాలయ్య విధ్వంసానికి తెర వెనక థమన్ పూనకాలు తెప్పించే మ్యూజిక్ అదరగొట్టేస్తుంది. రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమా సక్సెస్ కు థమన్ మ్యూజిక్ ప్లస్ అయ్యింది.
ఐతే థమన్ బిజిఎం కి కొంత క్రేజ్ ఉంది. ఐతే అతను ట్యూన్స్ కాపీ చేస్తాడన్న టాక్ ఉంది. దాదాపు చాలాసార్లు థమన్ లేపేసిన అదె కాపీ చేసిన ట్యూన్స్ ని బయట పెడుతూ సోషల్ మీడియాలో హంగామా తెలిసిందే. లేటెస్ట్ గా థమన్ అల వైకుంఠపురంలో సినిమాలో బిజిఎం ని కూడా మరో సినిమా నుంచి కాపీ చేసినట్టు తెలుస్తుంది. అల వైకుంఠపురంలో సినిమాలో క్లైమాక్స్ లో టబు మెట్ల మీద నుంచి కిందకు దిగుతూ వచ్చే సీన్ లో బిజిఎం ఉంటుంది.
Thaman : ఈ కాపీ ట్యూన్స్ బదులుగా..
అది పాత టబు సినిమా నుంచి కాపీ చేసి యాజిటీజ్ ఇచ్చేశాడు థమన్. అది చూసిన ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. థమన్ కాపీ కొట్టడం కామనే దొరికిపోవడం కూడా కామనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా థమన్ ఈ కాపీ ట్యూన్స్ బదులుగా ఎలాగు ఒక పాపులారిటీ వచ్చింది కాబట్టి పూర్తిగా సొంత ట్యూన్స్ వాడితే బెటర్ అని ఆయన ఫ్యాన్సే అంటున్నారు.
ఐతే థమన్ కాపీ ట్యూన్స్ పై అతను కూడా ఒకసారి స్పందించాడు. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అడిగితేనే తాను అలా చేస్తాను తప్ప మరో ట్యూన్ కాపీ చేయాల్సిన అవసరం తనకు లేదని అంటున్నాడు. మరి ఈ కాపీ ట్యూన్ అపరాదం ఎవరిదో తెలియదు కానీ థమన్ ట్యూన్ ఎక్కడైనా దొరికితే మాత్రం ఆ రోజు సోషల్ మీడియాలో థమన్ కి ఫుల్ కోటింగ్ ఉంటుంది. Thaman, Ala Vaikunthapuramulo, BGM, Trivikram, Allu Arjun, Tabu
Orey 😂😂🤣🤣😭😭
Thaman mowa idi na fav bgm idi kuda copy ye na !! @MusicThaman
Tabu cinema tune ni Tabu ke malli vadav chusava oka mettu ekkesavayya 😭😭
Inthaki bhAAi @alluarjun ki ee vishayam telusa?? #AlluArjun #AlaVaikunthapurramuloo pic.twitter.com/fIckdYZjNE
— Vamc Krishna (@lyf_a_zindagii) January 25, 2025