Nagarjuna : వామ్మో.. టబుకి నాగార్జున ముద్దు పేరు కూడా పెట్టాడా.. అదేంటంటే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nagarjuna : వామ్మో.. టబుకి నాగార్జున ముద్దు పేరు కూడా పెట్టాడా.. అదేంటంటే..!

Nagarjuna : కింగ్ నాగార్జున ఒక‌ప్పుడు మ‌న్మ‌థుడిగా అమ్మాయిల హృద‌యాల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఆయ‌న హీరోయిన్స్‌తో ఎక్కువ‌గా ఎఫైర్ పెట్టుకున్నాడ‌నే ప్ర‌చారం కూడా ఉంది. నాగార్జున మాత్రమే ఇలాంటి రూమర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ టబుతో నాగ్ కెమిస్ట్రీ బాగుండడంతో ఆఫ్ స్క్రీన్ కూడా వీరిపై ఎన్నో ప్ర‌చారాలు సాగాయి. వాటిపై నాగార్జున ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. టబు గురించి ఓ ఇంట‌ర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ..టబు వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 May 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Nagarjuna : వామ్మో.. టబుకి నాగార్జున ముద్దు పేరు కూడా పెట్టాడా.. అదేంటంటే..!

Nagarjuna : కింగ్ నాగార్జున ఒక‌ప్పుడు మ‌న్మ‌థుడిగా అమ్మాయిల హృద‌యాల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఆయ‌న హీరోయిన్స్‌తో ఎక్కువ‌గా ఎఫైర్ పెట్టుకున్నాడ‌నే ప్ర‌చారం కూడా ఉంది. నాగార్జున మాత్రమే ఇలాంటి రూమర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ టబుతో నాగ్ కెమిస్ట్రీ బాగుండడంతో ఆఫ్ స్క్రీన్ కూడా వీరిపై ఎన్నో ప్ర‌చారాలు సాగాయి. వాటిపై నాగార్జున ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. టబు గురించి ఓ ఇంట‌ర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ..టబు వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. అమల దగ్గరుండి టబుకు ఇల్లు కట్టించింది. వాళ్లిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చాలామందికి తెలియనిది ఏంటంటే టబు హైదరాబాద్ అమ్మాయి. అలా పరిచయం అయ్యింది అని అన్నారు.

Nagarjuna : భ‌లే పేరు పెట్టావ‌య్యా..

ట‌బు నా ఫేవరెట్ హీరోయిన్, ఇష్టమైన కో వర్కర్ ఎవరంటే టబు అనే చెప్తాను. ఇప్పటికీ హైదరాబాద్ వస్తే ఇంకెక్కడికీ వెళ్లదు. మా ఇంట్లోనే ఉంటుంది. నాన్నకు కూడా తనంటే అంతే ఇష్టం అని ట‌బు త‌నతో పాటు త‌న ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్ అనేలా నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే టబుకి నాగార్జున ఓ ముద్దు పేరు కూడా పెట్టాడట. ఆ విషయాన్ని టబు బయటపెట్టింది. పెద్ద ఈవెంట్‌లో ఇండస్ట్రీ మొత్తం ఉన్న ఈవెంట్‌లో ట‌బు పాల్గొని తెలుగు ఇండస్ట్రీ గురించి, తన కెరీర్‌లో బెస్ట్ మూమెంట్స్ గురించి ఆమె మాట్లాడింది. కూలీ నెంబర్‌ 1`తో తన కెరీర్‌ ప్రారంభమైందని తెలిపింది. ఈ సందర్భంగానే పండు అనే పేరుని ఇచ్చినందుకు నాగార్జునకి థ్యాంక్స్ అని తెలిపింది టబు. అంటే టబుకి పండు అనే ముద్దు పేరు పెట్టాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Nagarjuna వామ్మో టబుకి నాగార్జున ముద్దు పేరు కూడా పెట్టాడా అదేంటంటే

Nagarjuna : వామ్మో.. టబుకి నాగార్జున ముద్దు పేరు కూడా పెట్టాడా.. అదేంటంటే..!

దీంతో టబు మాటలకు ఈవెంట్‌ మొత్తం అరుపులతో గోల చేయడం విశేషం. కృష్ణ‌వంశీ ట‌బుని నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం ఎంపిక చేశాడు. ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాలో నాగార్జున రొమాన్స్ కి టబు అందం తోడు కావడంతో ఈ సినిమా సూప‌ర్ హిట్ అయింది. ఇద్దరు కలిసి వెండితెరపై రచ్చ చేశారు. అలా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదే సమయంలో ఇద్దరి మధ్య రిలేషన్‌ కూడా బిల్డ్ అయ్యిందనే వార్తలు వచ్చాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది