
Tamannah revealed her beauty secret
Tamannaah : తమన్నా చెప్పిన ఈ విషయం తెలిస్తే ఎవరికైనా మైండ్ కాసేపు ఆగిపోవాల్సిందే. ఇలాంటివి కూడా చేస్తారా ..అది కూడా తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ అని నోరెళ్లబెడతారు. మిల్కీ బ్యూటీగా తమన్నాకి సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకొచ్చి దాదాపు 15 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ అదే వన్నెతో తళ తళలాడుతోంది. ఈ మధ్యనే ఇండస్ట్రీకొచ్చిన కొత్త తారలా తళుక్కుమంటోంది. టాలీవుడ్ కోలీవుడ్ లో ఇప్పటి వరకు తమన్నా చేసిన సినిమాలన్ని దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
Tamannah revealed her beauty secret
ప్రస్తుతం తమన్నా చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే వరుసగా థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది. ఇటు సిల్వర్ స్క్రీన్ మీద అటు డిజిటల్ ప్లాట్‌ఫాం మీద తమన్నా సత్తా చాటుతోంది. గోపీచంద్ హీరోగా నటించిన ‘సీటిమార్’ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. అలాగే ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా పూర్తి చేసింది. నితిన్ నటిస్తున్న ‘మాస్ట్రో’ సినిమాలో కాస్త బోల్డ్ పాత్రలో కనిపించబోతోంది.
Tamannah revealed her beauty secret
ఇంత బిజీగా ఉన్న తమన్నా గ్లామర్ విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ద చేయదట. క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ అండ్ బ్యూటీ టిప్స్ పాటిస్తుందట. తన అందానికి కారణం ఏంటో తాజాగా వెల్లడించింది. ముఖ్యంగా తన స్కిన్ కేర్ విషయంలో మార్నింగ్ సెలైవాను వాడుతుందట. ఉదయం లేచాక తన లాలాజాలం(సలైవా)ను స్కిన్ మీద అప్లై చేస్తుందట. ఇది చాలమందికి తెలియకపోవచ్చు. సలైవా చర్మ వ్యాధులకి సంబంధించిన సమస్యలను బాగా ఎదుర్కొంటుంది. స్కిన్ సమస్యలను క్లియర్ చేయడంలో బాగా పని చేస్తోంది. అందుకే స్కిన్ కేర్ విషయంలో ఎక్కువగా అది వాడతాను.. అని తెలిపింది. ఇది కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుందేమోగానీ తమన్నా చెప్పినది ఫాలో అయితే అపోహలన్నీ తొలగిపోవడం గ్యారెంటీ.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.