Jabardasth Varsha : అవును.. నేను పెళ్లి చేసుకుంటున్నా.. పెళ్లి కొడుకు ఎవరంటే..?
Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష.. తెలుగు బుల్లి తెర అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది వర్ష. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ తో తనకున్న అనుబంధమే వేరు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష.. ఇద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ మీద చేసే రచ్చ మామూలుగా ఉండదు. అందుకే.. జబర్దస్త్ వర్షకు అంత క్రేజ్. ప్రస్తుతం జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్, వర్ష లేని స్కిట్ ను ఊహించలేము. వాళ్లు ఉంటేనే జబర్దస్త్ కు అందం. ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీ ఎంత ఫేమస్సో.. ఇప్పుడు వీళ్లిద్దరూ అంత ఫేమస్ అయిపోయారు.

jabardasth varsha to get married soon
అయితే.. జబర్దస్త్ వర్ష పెళ్లి గురించి చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. చాలామంది బ్యూటీలు ఈ మధ్య పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. యాంకర్ రష్మీ పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో బాగానే చర్చ నడుస్తుంది. అలాగే.. జబర్దస్ వర్ష.. పెళ్లెప్పుడు బ్యూటీ అంటూ తనను నెటిజన్లు రోజూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ.. వర్ష మాత్రం రేపు, మాపు అంటూ తప్పించుకునేది. అలాగే.. ఇమ్మాన్యుయేల్, వర్ష మధ్య ఏదో ఉందంటూ వార్తలు కూడా రావడంతో పాటు.. చాలాసార్లు జబర్దస్త్ స్టేజ్ మీద ఇమ్మూ మీద తనకున్న ప్రేమను చాటి చెప్పింది వర్ష.
Jabardasth Varsha : ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేసిన వర్ష
తాజాగా వర్ష తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలతో పాటు.. జులై 4న ఓ అనౌన్స్ మెంట్ అంటూ తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూపించింది. దీంతో అందరూ.. వర్ష పెళ్లికి రెడీ అయిపోయింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటోంది వర్ష.. అందుకే.. బిగ్ అనౌన్స్ మెంట్ అంటూ ప్రకటించింది.. అంటున్నారు. అంత వరకు బాగానే ఉంది కానీ.. మా ఇమ్మాన్యుయేల్ సంగతి ఏంటి? ఆయనను కాకుండా వేరే వాళ్లను పెళ్లి చేసుకుంటోందా వర్ష.. అంటూ ఇమ్మా అభిమానులు అయితే తెగ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా.. అసలు విషయం ఏంటో తెలియాలంటే మాత్రం జులై 4 వరకు ఆగాల్సిందే.

jabardasth varsha to get married soon
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram