Tamannah : తన పెళ్లి ఎప్పుడో చెప్పిన మిల్కీబ్యూటీ తమన్నా..

Authored By mallesh | The Telugu News | Published on: October 26, 2021, 12:30 pm

Tamannah : తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గుతున్న కొద్దీ హీరోయిన్లు తమ పెళ్లి పై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో కొత్త నీరు వస్తున్న కొద్దీ పాత నీరు అంతా వెళ్లిపోతున్నదనేది పెళ్లితోనే స్ఫష్టం చేస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు. అయితే, కొందరు కెరీర్ రైజింగ్ టైంలో కూడా పెళ్లి చేసుకుని తమ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. సమంత 2017లో పెళ్లిచేసుకుని మరీ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఆమె బాటలో కాజల్ అగర్వాల్ సైతం ఇటీవల పెళ్లి చేసుకుని సినిమాలు చేస్తున్నది. నయన్ తార కూడా త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ ను పెళ్లిచేసుకునేందుకు సిద్ధం అవుతున్నది.. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా కూడా పెళ్ళి చేసుకోబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Tamannah Marriage News

Tamannah Marriage News

Tamannah : సరైన అవకాశాలు లేకనే..

మిల్కీబ్యూటీ తమన్నా దశాబ్ద కాలంగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ వస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఈమె ఏ చిన్న క్యారెక్టర్ అయినా చేసేందుకు సిద్ధపడుతోంది. దీనిని బట్టి ఈ బ్యూటీ రేంజ్ తగ్గిందని ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే, ఇటీవల తమన్నా ఎక్కడకు వెళ్లినా పెళ్లి ఎపుడు అని అందరూ అడుగుతున్నారట.. దీంతో విసిగిపోయినా ఈ బ్యూటీ వారికి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిందట..

నా పెళ్లి అప్పుడే..

Tamannah Marriage News

Tamannah Marriage News

పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ఇంకా డిసైడ్ కాలేదని, తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని .. టైం వచ్చినప్పుడు మీకు తప్పుకుండా చెబుతానని తెలిపింది ఈ అమ్మడు. తన కెరీర్‌లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానని స్పష్టంచేసింది మిల్కీబ్యూటీ. తమన్నా సమాధానం విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అయినట్టు తెలిసింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp