Home » Entertainment » Tanikella Bharani Comments On Ali And Venu Madhav
Entertainment

Tanikella Bharani : ఆలీ, వేణుమాధవ్ ల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన తణికెళ్ల భరణి..!

Authored By
aruna
The Telugu News | Published on: February 5, 2024, 6:00 pm
Advertisement

Tanikella Bharani : నటుడిగా, రచయితగా, డైరెక్టర్ గా తనికెళ్ల భరణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. 40 ఏళ్లు గా దాదాపుగా 800 పైగా సినిమాలలో నటించిన ఆయన ఇప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. అయితే తాజాగా తనికెళ్ల భరణి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆలీ, వేణుమాధవ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలీ, వేణుమాధవ్ లకు చాలా టాలెంట్ ఉందని, అందరూ కమెడియన్స్ అంటే మామూలుగా చూస్తారు కానీ ఆలీ, వేణుమాధవ్ లాంటి వారికి చాలా గొప్ప టాలెంట్ ఉందని ప్రశంసించారు. షూటింగ్లకు విదేశాలకు వెళ్ళినప్పుడు ఆలీ అందరి సౌకర్యాలను చూస్తాడని, అతడుంటే ఎవరికీ భయం ఉండదని, అన్నింటిని దగ్గర ఉండి చూసుకుంటాడని తనికెళ్ల భరణి ఆలీ గురించి చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక ఒకసారి విదేశాలలో షూటింగ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కమెడియన్స్ అంతా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు వేణుమాధవ్ నన్ను పాట పాడమని అడిగారు. సరే నేను పాట పాడుతా వాయించడానికి ఏమీ లేవు కదా అన్నాను. దానికి అతడు చొక్కా విప్పేసి పొట్ట మీదే డప్పు వాయించాడు. అంత అద్భుతంగా వాయించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అతడిలో చాలా టాలెంట్ ఉంది అని వేణుమాధవ్ ను పొగిడారు. ఇక ఇప్పటిదాకా 300 సినిమాలలో తండ్రి పాత్రలు చేశానని, ఇటీవల అన్ని రొటీన్ పాత్రలే వస్తున్నాయని ప్రతి సినిమాలో హీరో లేదా హీరోయిన్ తండ్రి పాత్రలు చేయమని డైరెక్టర్లు అడుగుతున్నారని, అటువంటి పాత్రలు చేసి బోర్ కొట్టిందని, అందుకే తండ్రి పాత్రలు వచ్చినా 18 సినిమాలను వదులుకున్నానని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం 10 సినిమాలలో నటిస్తున్నానని, ఒక్కో సినిమాలో ఒక రకమైన పాత్ర చేస్తున్నానని విలన్ గా కూడా నటిస్తున్నానని అలాంటి పాత్రలు చేయడమే ఇష్టం అని తనికెళ్ల భరణి అన్నారు. నాటకాలు వేసుకుంటున్న సమయంలో ఆత్రేయ తన సినిమాలకు పాటలు రాయమని 400 జేబులో పెట్టారని ఆ సమయంలో నేను చాలా సంతోషపడ్డానని తనికెళ్ల భరణి అన్నారు. ఇక ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో అందరితో కలిసి నటించానని, నందమూరి ఫ్యామిలీతో కూడా కలిసి నటించానని కానీ ఒక్క అన్నగారితోనే నటించలేదని అన్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి