Tejaswi Madivada : సముద్రం ఒడ్డున తేజస్వీ అలా.. బికినీలో బిగ్ బాస్ బ్యూటీ

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 5, 2021, 4:45 pm

Tejaswi Madivada  బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ ఎప్పుడో ఫేడవుట్ అయిపోయింది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సమయంలో తేజస్వీ మంచి ఫాంలో ఉండేది. ఆ తరువాత కొన్ని బోల్డ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఐస్ క్రీం అంటూ మరీ దారుణమైన సినిమాల్లో నటించింది.అయితే అప్పుడు కూడా తేజస్వీ కెరీర్ ఓ మాదిరిగా ఉండేది. అయితే బిగ్ బాస్ షో మాత్రం ఆమెను దారుణంగా దెబ్బ కొట్టేసింది. ఇమేజ్ మొత్తాన్ని కరాబ్ చేసేసింది.

tejaswi madivada pic with friend

tejaswi madivada pic with friend

అలా తేజస్వీ బిగ్ బాస్ అనంతరం ఘోరమైన పరాభవాన్ని ఎదురుచూసింది. సినిమా ఆఫర్లు లేకుండాపోయాయి. బుల్లితెరపై వచ్చిన అవకాశం కూడా బెడిసికొట్టేసింది. బిగ్ బాస్ ఆట ద్వారా ఆమె కొనితెచ్చుకున్న నెగెటివిటీ అంతా ఇంతా కాదు. అలా తేజస్వీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కాలాన్ని గడిపేస్తోంది. ప్రేమ, పెళ్లి మీద నానా రకాల కామెంట్లు చేసింది. ఫస్ట్ లాక్డౌన్ సమయంలోనే పెళ్లి మీద తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇప్పట్లో పెళ్లి అనేదే చేసుకోను అని పరోక్షంగా కౌంటర్లు వేసింది.

tejaswi madivada pic with friend

tejaswi madivada pic with friend

Tejaswi Madivada బికినీలో తేజస్వీ రచ్చ..

ఈ బ్యూటీకి బికినీలు, బీచ్ వ్యూలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా వాటి గురించే ఆలోచిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె తనకు ఇష్టమైన ప్రదేశానికి చేరుకున్నట్టుంది. బిచ్‌లో తెగ సందడి చేస్తోన్నట్టు కనిపిస్తోంది. బికినీలో దర్శనమిచ్చిన తేజస్వీని చూసి అందరూ షాక్ అవుతున్నారు. తేజస్వీ తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరూ బికినీలో ఇచ్చిన ట్రీట్ మామూలుగా లేదు.

tejaswi madivada pic with friend

tejaswi madivada pic with friend

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp