Tejaswi : కౌశ‌ల్ వ‌ల్ల‌నే నేను ఇలా త‌యారయ్యా.. తేజ‌స్వి షాకింగ్ కామెంట్స్…!

Authored By Sam C | The Telugu News | Published on: August 25, 2022, 7:40 pm

Tejaswi : తేజ‌స్వి మ‌దివాడ.. ఐస్‌క్రీం చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ముద్దుగుమ్మ‌. బిగ్ బాస్ షోలో రెండు సార్లు అడుగుపెట్టి అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ మరింత ఫాలోయింగ్‌ను తెచ్చుకుంటోంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన ఈ భామ.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఈ భామ వీలున్నప్పుడల్లా ఫోటో షూట్‌లు చేస్తూ కేక పెట్టిస్తోంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు క‌మిట్‌మెంట్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఈ సినిమా ప్రమోషన్‌‌లో భాగంగా తేజస్వి కొన్ని సంచలన విషయాలను పంచుకుంది.

Tejaswi : స్ట‌న్నింగ్ కామెంట్స్..

ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి మాట్లాడుతూ.. ఓ సారి సుమారు 30 మంది తాగొచ్చి తనను ఎటాక్‌ చేశారని.. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని తెలిపింది తేజస్వి.ఇక చాలా రోజుల త‌ర్వాత కౌశ‌ల్ ప్ర‌స్తావ‌న కూడా తీసుకు వ‌చ్చింది. బిగ్ బాస్ లో నుండి తాను బయటికి వచ్చిన వెంటనే తన ఫ్రెండ్స్ తనను పట్టుకుని ఏడ్చేశారట. ఏమైంది అని చూస్తే మీమ్స్‌, బూతులు.. ఇష్టం వచ్చినట్లు చేశారని.. దీనితో ఉన్న ఆఫర్స్ కూడా పోయినట్లు తేజస్వి కామెంట్స్ చేసింది. అతడి వల్లే ఇలా అయ్యాను అని.. అమ్మాయిలని బదనాం చేసి ముందుకు వెళ్ళాలనే మనస్తత్వం అతడిది.

tejaswi comments on Bigg Boss kaushal

tejaswi comments on Bigg Boss kaushal

కౌశల్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. దర్శకుడు నాకు కమిట్మెంట్ కథ చెప్పగానే.. ఇది ఇండస్ట్రీలో కౌశల్ లాంటి వ్యక్తుల గురించే అని అనిపించింది. అతడిపై రివేంజ్ లాగా అనిపించినట్లు తేజస్వి పేర్కొంది. బిగ్ బాస్ లో అతడి ప్రవర్తన అంతా ఫేక్ అని ఇప్పుడు ఆయన గురించి అందరికి తెలుసు అని తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. మొన్న‌టికి మొన్న శ్రీరెడ్డి గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన తేజ‌స్వి ఇప్పుడు కౌశ‌ల్ గురించి దారుణంగా మాట్లాడుతూ వార్త‌ల‌లో నిలిచింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp