Nagarjuna : బిగ్ బాస్ కోసం నాగార్జున పారితోషికం ఎంతో తెలిసి పోయింది

Authored By aruna | The Telugu News | Published on: August 22, 2022, 6:20 pm

Nagarjuna : తెలుగు బిగ్‌ బాస్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధం అయ్యాడు. నాగార్జున పై ప్రోమో ఇప్పటికే వచ్చింది. రెండవ ప్రోమోను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసి షో ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సెప్టెంబర్‌ మొదటి ఆదివారం ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ ప్రారంభం అవ్వబోతుంది అంటూ ఇప్పటికే అధికారికంగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ గురించి మరియు బిగ్ బాస్ కు వరుసగా నాల్గవ సారి హోస్టింగ్‌ చేయబోతున్న నాగార్జున పారితోషికం గురించి ఆసక్తికర చర్చ టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.

నాగార్జున గత సీజన్ కు గాను 12 కోట్ల రూపాయల పారితోషికం ను బిగ్ బాస్ నిర్వాహకుల నుండి దక్కించుకున్నాడట. ఇప్పుడు ఆ మొత్తం ను 15 కోట్ల కు పెంచారు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున మరియు షో నిర్వాహకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 15 కోట్లు మరియు లాభాల్లో కొంత మొత్తం వాటాగా ఆయన పారితోషికం అందుకుంటాడు అంటున్నారు. లాభాల్లో వాటా విషయం పక్కన పెడితే నాగార్జున ముందుగానే 15 కోట్ల రూపాయలను తన ఖాతాలో బిగ్‌ బాస్ పేరు మీద వేసుకోబోతున్నాడు.

telugu Bigg Boss 6 Telugu Nagarjuna Remuneration goes viral

telugu Bigg Boss 6 Telugu Nagarjuna Remuneration goes viral

షో కోసం నాగార్జున వారం లో కేవలం ఒక్క రోజు కేటాయించబోతున్నాడు. శని మరియు ఆది వారం ల యొక్క ఎపిసోడ్స్ కోసం నాగార్జున శనివారం మొత్తం ఎడు నుండి ఎనిమిది గంటల సమయం ను కేటాయిస్తాడు. అలా బిగ్ బాస్ కోసం అతి తక్కువ సమయం కేటాయించి ఏకంగా 15 కోట్ల పారితోషికం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక కంటెస్టెంట్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్స్ ఉదయభాను గా సమాచారం అందుతోంది. ఆమె వారం వారం కూడా పారితోషికం అందుకుంటుంది. దాదాపుగా అయిదు లక్షల వరకు ఆమె పారితోషికం ఉంటుందట.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp