telugu bigg boss ott mumaith khan news clarity
Bigg Boss OTT : తెలుగు ప్రేక్షకుల ముందుకు డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా బిగ్ బాస్ రాబోతుంది. రేపటి నుండి షో భారీ ఎత్తున ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీ కి అంతా సిద్ధం అయ్యింది. ఈ సమయం లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. పాత మరియు కొత్త కంటెస్టెంట్స్ తో కలిపి ఓ అద్భుతమైన అమేజింగ్ రియాల్టీ షో ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. పాత కంటెస్టెంట్స్ ముఖ్యంగా గొడవలు పడే వారిని తీసుకు వస్తున్నట్లుగా మొదటి నుండి షో నిర్వాహకులు చెబుతూ వచ్చారు. అందులో భాగంగా ముమైత్ ఖాన్ న్ని షో కోసం తీసుకు రాబోతున్నారు అన్నట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా షో కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయిన నేపథ్యంలో ముమైత్ ఖాన్ షో లో లేదు అంటూ క్లారిటీ వచ్చింది.
ఒక్క రోజు టైం ఉన్న ఈ సమయం లో ఇలాంటి ప్రకటన రావడం అభిమానులకు ఒకింత అసహనం కలిగిస్తుంది. ముమైత్ ఖాన్ ఉంటే కచ్చితంగా గొడవలు మరియు ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఉండేవని, కానీ ఇప్పుడు ఎలాంటి మసాలాలు ఏమీ ఉండవు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో బిగ్ బాస్ నుండి ఇంకా ఎంత మంది వివాదాస్పదన కంటెస్టెంట్స్ ని ఆశించిన వారు ఉండరేమో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్ క్లీయర్ గా ప్రేక్షకుల ముందుకు అధికారికంగా రాబోతుంది.షో కు సంబంధించినంత వరకు ఇప్పటికే భారీ ఎత్తున పరిచయ కార్యక్రమాలకు సంబంధించిన డ్యాన్సులు షూటింగ్ జరిగిపోయాయి. అన్నపూర్ణ స్టూడియో లో అతి పెద్ద షో కు సంబంధించిన షూటింగ్ నిర్వహిస్తున్నారు.
telugu bigg boss ott mumaith khan news clarity
ఇన్ని రోజులుగా క్వారంటైన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియో కు చేరుకున్నారు. రేపటి నుండి ప్రసారం కాబోతున్న ఈ షో గురించి రకరకాల పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. లైవ్ కాకుండా షో ని ప్రేక్షకుల ముందుకు కాస్త ఆలస్యంగా తీసుకు రాబోతున్నారు అన్నట్లుగా తెలుస్తోంది. 24 గంటలు కూడా స్ట్రీమింగ్ చేసే షో కనుక కాస్త టైమ్ గ్యాప్ ఉంటుంది అంటున్నారు. కనుక షో ముందుగానే స్ట్రీమింగ్ చేయకుండా కనీసం రెండు రోజులు వెనక్కు ఉంటుంది అంటూ సమాచారం అందించండి. రెగ్యులర్ బిగ్ బాస్ ఈ రోజు జరిగింది రేపు చూపిస్తారు. కాని ఇక్కడ మాత్రం రెండు రోజుల క్రితం జరిగింది ఈ రోజు చూపిస్తారని వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరో ఒక్క రోజు ఆగాల్సిందే.
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
This website uses cookies.