
Health Benefits of gachakaya
Health Benefits : గచ్చకాయలు ఈ పేరుని మన చిన్నప్పటినుంచి వింటూనే ఉంటాము. వీటితో చిన్నప్పుడు ఆడుకోవడం, బండ మీద రుద్ది పక్కనున్న వారి చర్మానికి పెడితే అది చురుక్కుమంటుంది. అలాగే ఈ గచ్చకాయల తో గచ్చకాయల ఆట ఆడుకుంటూ ఉంటారు. వీటితో ఆడుకోవడమే కాదు వీటిని ఆభరణాలుగా చేసుకుని పెట్టుకుంటారు కూడా. వీటిని పొలాల గట్ల కు జంతువులు ప్రవేశించకుండా అడ్డుగా కట్టేవారు. ఈ చెట్లు ఎక్కువగా తెలంగాణ,ఆంధ్రలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము.ఈ గచ్చకాయలలో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గచ్చకాయల ను వివిధ రకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు.ఈ గచ్చకాయలు మలేరియా జ్వరాన్ని, డెంగ్యూ జ్వరం వంటి వాటి నుంచి ఎదుర్కోవడానికి ఇవి సహాయపడతాయి.
ఈ గచ్చకాయ ఆకులతో లేదా కొమ్మలతో పంటి నొప్పిని కూడా తగ్గించుకోవచ్చును. ఈ ఆకులను లేదా కొమ్మలను పేస్టుగా చేసుకొని వంటి మీద ఉంచుకోవడం వల్ల పంటి ఉపశమనం కలుగుతుంది. వీటి ఆకులను ఉపయోగించి గొంతు నొప్పిని కూడా తగ్గించుకోవచ్చును. ఈ ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని తీసుకోని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.ఈ గచ్చకాయ వల్ల అధిక చెమటను, చెమట నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించుకోవచ్చును ఈ ఆకుల రసంతో ఎలిఫెంటీయాసిస్ కూడా తగ్గించుకోవచ్చును. పూర్వకాలంలో మసూచి వ్యాధిని ఎదుర్కోవడంలో ఈ గచ్చకాయ ఉపయోగపడింది ఈ గచ్చకాయలు రక్తస్రావం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో కూడా ఉపయోగపడతాయి
Health Benefits of gachakaya
అంతేకాకుండా చర్మ సమస్యలు, కుష్టి వ్యాధి వంటి వాటిని ఎదుర్కోవడంలో కూడా గచ్చకాయ ఉపయోగపడతాయి. ఈ గచ్చకాయలు మూత్ర సమస్యల నుంచి లివర్ సమస్యలనుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి.ఈ గచ్చకాయలు రుతుక్రమ సమస్యలను, మెనోపాజ్ సమస్యల నుంచి ఋతుస్రావంలో ఏర్పడి నొప్పిని కూడా ఈ గచ్చకాయలు తగ్గిస్తాయి. పేగులలో ఉండే నులిపురుగులను కూడా ఇవి ఎదుర్కొంటాయి. ఈ మొక్క లో ఉండే యాంటీడేరియల్ చర్య విరేచనాలు,అలాగే వదులుగా ఉండే పేగులను నయం చేస్తుంది. అంతేకాకుండా కొలీక్ నొప్పి నివారణ సులభతరం చేస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్య లకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.