Health Benfits : పాలకంటే పది రెట్లు ఎక్కువ బలాన్నిచ్చే పొన్నగంటి కూర గురించి తెలియని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా దొరికే ఈ పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొన్నగంటి కూరను వృక్ష శాస్త్ర ప్రకారం ఆల్టర్ నాంథెరా సెసిలిస్ గా పిలుస్తారు. ఈ పొన్నగంటి కూరను వంటల్లోనే కాకుండా ఆయుర్వేద మూలికల్లో కూడా వాడతారు. అమరాంతసీ కుటుంబానికి చెందిన ఈ పొన్నగంటి కూరను… మత్స్యాక్షి, పొన్నంకన్ని కీరై, పొన్నంగన్ని, ముకునువెన్న, గుడారి సాగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది పంట పొలాల్లో నీరు పారే కాలువల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్కను గుర్తించడం చాలా తేలిక.
అయితే ఈ పొన్నగంటి కూర కేవలం నీరు ఉన్న దగ్గరే కాకుండా వేడి వాతావరణంలో కూడా పెరుగుతుందట.పొన్నగంటి కూరను దీనిని ఆకు కూరంగా వండుకని తింటుంటారు చాలా మంది. మరికొందరు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. పొన్నగంటి కూర ఆకుల్లో బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం మరియు విటామిన్ సి, ఎ లు అధికంగా ఉంటాయి. పొన్నగంటి కూరను సలాడ్, ఆకు కూరలుగా వండుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పొన్నగంటి కూరలో పీచు పధార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని పాలకూర కాడలను కోసినట్లుగా కోయకుండా కేవలం ఆకులను మాత్రమే వండుకొని తినాలి. ఆకులను పప్పులో ఉడికించి, సూప్ లు, ఫ్రైలు కూరలుగా తింటారు.
రిఫ్రిజిరేటర్ లో ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసినప్పుడు అవి రెండ్రోజులు నిల్వ ఉంటాయి. మన పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి పొన్నగంటి కూర ఆకులను 48 రోజులపాటు ప్రతిరోజూ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయట.పొన్నగంటి కూరలో ఉండే బీటా కెరోటిన్, విటామిని ఏలు మన కళ్లను రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా కళ్ల అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి. రెండ్రోజులు పొన్నగంటి ఆకులను తింటే మొహంపై సహజమైన గ్లో వస్తుందట. అంతే కాకుండా ఈ ఆకుల రసాన్ని తలనొప్పి తగ్గించేందుకు, శరీరంలోనే వేడిని తగ్గించేందుకు ఉపయోగిస్తారట.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.