Telugu Heroine : వామ్మో నాల్గోసారి పెళ్లి పీటలు ఎక్కిన తెలుగు హీరోయిన్
ప్రధానాంశాలు:
నాల్గో పెళ్లి చేసుకుబోతున్న హీరోయిన్
Telugu Heroine : వామ్మో నాల్గోసారి పెళ్లి పీటలు ఎక్కిన తెలుగు హీరోయిన్
Telugu Heroine : తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వనిత విజయ్ కుమార్ వ్యక్తిగత జీవితంతో తరచూ వార్తల్లో నిలుస్తుంది. విజయ్ కుమార్ కుమార్తెగా సినీ రంగంలో అడుగుపెట్టి “చంద్రలేఖ” చిత్రం ద్వారా సినీ ప్రయాణం ప్రారంభించిన వనిత, తరువాత తెలుగులో “దేవి” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా చురుకుగా వ్యవహరిస్తున్న ఆమె, యూట్యూబ్ ద్వారా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu Heroine : వామ్మో నాల్గోసారి పెళ్లి పీటలు ఎక్కిన తెలుగు హీరోయిన్
Telugu Heroine : ముగ్గురు అయిపోయారు..ఇప్పుడు నాల్గో వ్యక్తి ..ఈ హీరోయిన్ మామూలుది కాదు
అయితే వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదొడుకులతో సాగుతుంది. మొదట ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా మారిన వనిత, తరువాత అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆనంద్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఓ కూతురు ఉంది. రెండో వివాహం కూడా ఎక్కువకాలం నిలకడగా కొనసాగలేదు. తరువాత ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్ తో మూడో పెళ్లి చేసుకున్న వనిత, తాజాగా కొరియోగ్రాఫర్ రాబర్ట్ ను పెళ్లి చేసుకుంది.
తాజాగా జరిగిన పెళ్లిలో రాబర్ట్ ఆమె మెడలో తాళి కడుతున్న సమయంలో వనిత భావోద్వేగానికి లోనవడంతో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వనిత గతంలో తీసుకున్న మూడు పెళ్లిళ్లు విఫలమైనప్పటికీ, ఈసారి అయినా నిలబడుతుందా..? లేక కొంతకాలానికే విడాకులకు దారి తీస్తోందా అనేది చూడాలి అని అంత మాట్లాడుకుంటున్నారు.