Anupama Parameswaran : ఫిలిం ఇండస్ట్రీ అంటేనే ఎన్నో గాసిప్స్. ఇప్పుడే కాదు.. పాత కాలం నుంచి అది ఉన్నదే. అయితే.. ఒకప్పటి సీనియర్ హీరోలు చాలా కలుపుగోలుగా ఉండేవారు. వాళ్లకు పెద్దగా ఈగో, ఆటిట్యూడ్ ఉండేది కాదు. కానీ.. ఈ తరం హీరోల రూటే సపరేటు. వాళ్లకు చాలా ఈగో ఉంటుంది. అందరు అలా ఉంటారని చెప్పలేం కానీ.. కొందరు మాత్రం తమ ఆటిట్యూడ్ ను చూపిస్తుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. వాళ్లను వాళ్లు మెగాస్టార్ రేంజ్ లో ఊహించుకుంటారు. పారితోషికాలు పెంచుతారు. హీరోయిన్లు ఇబ్బంది పెడతారు..
ఇలా చాలా రకాలుగా ఉంటుంది వాళ్ల ఆటిట్యూడ్. అయితే.. ఇప్పుడు మనం మాట్లాడుకునేది డీజే టిల్లు సిద్ధూ గురించే. అవును.. డీజే టిల్లు కంటే ముందు సిద్ధూ చాలా సినిమాల్లో నటించినా ఆయనకు అంత గుర్తింపు రాలేదు కానీ.. ఎప్పుడైతే డీజే టిల్లు సినిమాలో నటించాడో ఇక చూసుకోండి.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. సిద్ధూకు పేరొచ్చింది. ఒక్క సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. అయితే.. డీజే టిల్లుకు సీక్వెల్ గా మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనూ సిద్ధూనే హీరో. కానీ.. ఈ సినిమా విషయంలో టిల్లు కాస్త ఎక్కువ చేస్తున్నట్టు తెలుస్తోంది. కావాలని ఇష్టం ఉన్నట్టు కథలో మార్పులు చేస్తున్నాడని అంటున్నారు. ఎందుకంటే..
కార్తీకేయ 2 సినిమాతో హిట్ కొట్టి మాంచి ఊపు మీదున్న అనుపమ పరమేశ్వరన్ ను ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ గా అనుకున్నారట. తర్వాత ఏమైందో కానీ.. ఇప్పుడు అనుపమను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పంచారట. నిజానికి.. అనుపమ కంటే ముందే చాలామందిని ఈ సినిమాకు హీరోయిన్ గా తీసుకున్నారు. సిద్ధూతో షూటింగ్ సమయంలో ఆమెకు సరిగ్గా పొసగలేదట. ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ.. వెంటనే అనుపమను పక్కకు తప్పించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి మడోన్నా సెబాస్టియన్ ను తీసుకున్నారట. అయితే.. అనుపమ విషయంలో సిద్ధూనే అందరూ తప్పు పడుతున్నారు కానీ.. అనుపమ వైపు కూడా తప్పు ఉందని అంటున్నారు. చూద్దాం మరి.. ఈ ఇష్యూ ఇంకా ఎంత దూరం వెళ్తుందో.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.