Venu Swamy : ఏంది.. వేణు స్వామి ఇలా జ‌రిగింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Venu Swamy : ఏంది.. వేణు స్వామి ఇలా జ‌రిగింది..!

Venu Swamy : హైద‌రాబాద్ : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి స‌మ‌స్య‌లు కొత్త కాదు. సెలబ్రిటీలపై తన అంచనాల విషయంలో అతను చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కోవడం మనం చూశాం. అతని రాజకీయ అంచనాలు చాలా సమయాల్లో తప్పుగా నిరూపించ‌బ‌డ్డాయి. దీని వల్ల అతను సోష‌ల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంటాడు. అయితే, వేణుస్వామి తాజా అంచనా ఆయ‌నను పెద్ద చిక్కుల్లో పడేసింది. వేణు స్వామి తన తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య – శోభిత ధూళిపాళ […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 August 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : వేణు స్వామి షాక్‌... ఏంది ఇలా జ‌రిగింది..!

Venu Swamy : హైద‌రాబాద్ : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి స‌మ‌స్య‌లు కొత్త కాదు. సెలబ్రిటీలపై తన అంచనాల విషయంలో అతను చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కోవడం మనం చూశాం. అతని రాజకీయ అంచనాలు చాలా సమయాల్లో తప్పుగా నిరూపించ‌బ‌డ్డాయి. దీని వల్ల అతను సోష‌ల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంటాడు. అయితే, వేణుస్వామి తాజా అంచనా ఆయ‌నను పెద్ద చిక్కుల్లో పడేసింది. వేణు స్వామి తన తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య – శోభిత ధూళిపాళ నిశ్చితార్థం తర్వాత వారిపై అంచనాలు వేసిన సంగతి తెలిసిందే. ఈ జంట కలిసి ఉండకపోవచ్చని, మూడేళ్లలో విడిపోతారని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దాంతో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TFDMA) సభ్యులు తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌ప‌ర్స‌న్ నేరెళ్ల శార‌ద‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. వేణు స్వామి అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఇరు వర్గాలు పేర్కొన్నాయి. దాంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 22న తమ ముందు హాజరు కావాలని వేణుస్వామికి నోటీసులు పంపింది.

Venu Swamy ఏంది వేణు స్వామి ఇలా జ‌రిగింది

Venu Swamy : ఏంది.. వేణు స్వామి ఇలా జ‌రిగింది..!

గతంలో వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యాలు కొన్నిసార్లు కరెక్ట్ కాగా.. చాలాసార్లు బెడిసి కొట్టాయి. కేసీఆర్, జగన్ జాతకాలు బాగున్నాయని ఈసారి వాళ్లే అధికారంలోకి మళ్లీ వస్తారని చెప్పుకొచ్చాడు. కానీ తీరా చూస్తే వారిద్దరూ ఓడిపోయారు. ఇక ప్రభాస్ సినిమాలు అయితే ఆడవని, ఆయన ఆరోగ్యం కూడా బాగుండందంటూ పదే పదే చెబుతుంటాడు. కానీ చివరకు కల్కి వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. ఇలా వేణు స్వామి చేసిన విశ్లేషణ, జాతకాలు చెప్పడంపై అందరూ భగ్గుమన్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది