Venu Swamy : రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై వేణు స్వామి జోస్యం.. ఇది ఎంత వరకు నిజం అవుతుంది..?
ప్రధానాంశాలు:
Venu Swamy : రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై వేణు స్వామి జోస్యం.. ఇది ఎంత వరకు నిజం అవుతుంది..?
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల వరుసగా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న వేణు స్వామి, తాజా ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలు, వివరించిన లెక్కలు సోషల్ మీడియా సహా రాజకీయ వేదికలపై విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. కొంతకాలంగా భారత రాష్ట్ర సమితి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడు పెంచిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని Revanth reddy లక్ష్యంగా చేసుకుని గులాబీ పార్టీ చేస్తున్న విమర్శలు, ప్రభుత్వంపై కూలిపోయే పరిస్థితులు వస్తాయని చేస్తున్న వ్యాఖ్యలపై వేణు స్వామి స్పష్టమైన అంచనాలు వెల్లడించారు.
Venu Swamy : రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై వేణు స్వామి జోస్యం.. ఇది ఎంత వరకు నిజం అవుతుంది..?
Venu Swamy చాలా రోజుల తర్వాత..
బీఆర్ఎస్ నేతలు, వారి సోషల్ మీడియా బృందం అధికార పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తుతుందని, ప్రభుత్వం కూలిపోతుందని, తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తారని చెబుతున్న నేపథ్యంలో, ఈ అంశాలన్నింటికీ వేణు స్వామి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 2026 సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. సమస్యలు ఎదురైనా సరే రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తారని, ప్రభుత్వ బండి సాఫీగానే సాగిపోతుందని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది మే నెల నుంచి కేసీఆర్ తన రాజకీయ విశ్వరూపాన్ని చూపడం మొదలు పెడతారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో 2027లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని, అప్పటి రాజకీయ సమీకరణాలు కీలకంగా మారవచ్చని అన్నారు.
కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై కూడా వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె కోరుకున్న విధంగా పరిణామాలు జరగవని, ఆమె అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినా కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఆశించిన స్థాయిలో మార్పు రాదని, కోరుకున్న ఫలితం దక్కదని ఆయన అభిప్రాయపడ్డారు. 2026లో తెలంగాణ రాజకీయాలు ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా సాగుతాయని, గులాబీ పార్టీ కార్యకర్తలు ఆశించే స్థాయిలో సానుకూల ఫలితాలు మాత్రం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వేణు స్వామి అంచనా వేశారు. కాగా, టీవీ5 మూర్తితో జరిగిన వివాదం తర్వాత కొంతకాలంగా వేణు స్వామి బహిరంగంగా కనిపించకపోవడం గమనార్హం. ఆ సమయంలో ఆయన అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుండగా అక్కడి పూజారులు ప్రశ్నించిన వీడియోలు వైరల్ కావడం, ఆపై ఆయనపై కొన్ని ఆరోపణలు రావడం కూడా పెద్ద చర్చకు దారితీసింది.